డయాబెటిస్ ముఖ్యంగా రెండు రకాలు.
టైప్1 డయాబెటిస్:
టైప్ 2 డయాబెటిస్:
ఈ రకం ఇన్సులిన్ నిరోధకత వలన కలుగుతుంది. కణత్వచంలో ఉండే ఇన్సులిన్ రెసిస్టర్లు వివిధ శరీరభాగాల్లో సరిగా విధిని నిర్వర్తించకపోవడం దీనికి ముఖ్యకారణంగా భావిస్తారు.
హోమియో చికిత్స విధానం...
డయాబెటిస్‌కి సంబంధించి హోమియోపతిలో అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి. హోమియో వైద్యవిధానంలో వ్యాధి లక్షణాలు, వ్యక్తి మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. హోమియోలో మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి మందులు నిర్ధారణ చేయడం జరుగుతుంది. దీన్ని మనం ఇండివిడ్యువాలిటీ అంటాం. దీని ద్వారా జెనిటిక్ కానిస్టిట్యూషనల్ మెడిసిన్‌ను ఎంచు కోవడం జరుగుతుంది.
హోమియో చికిత్స వల్ల కలిగే లాభాలు...
- షుగర్‌ను కంట్రోల్ చేయవచ్చు
- షుగర్ వల్ల వచ్చే దుష్ఫలితాలను అరికట్టవచ్చు
- మనిషి మానసిక ఆందోళనకు గురైనప్పుడు శరీర అవయవాలపై ప్రభావం పడకుండా చూస్తుంది
- డయాబెటిస్‌ను ముందుగానే గుర్తించినప్పుడు హోమియో మందులు వాడడం వలన ఎలాంటి ఇతర మందులు వాడకుండా చేస్తుంది.
- హోమియో మందులు వాడడం వలన (లేక) ఇతర మందులతో పాటు హోమియో మందులు వాడడం వలన ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు హోమియో మందులు: లైకోపోడియం...
- ఈ మందు డయాబెటిస్‌కు చక్కగా పని చేస్తుంది. ఈ మందు ఎక్కు వగా మానసిక ఆందోళనకు గురైన వారికి ఉపయోగపడుతుంది. లైకోపోడియం వ్యక్తిత్వం పిరికితనం. ఎక్కువగా తీపిపదార్థాలను ఇష్టపడుతారు. వీరిలో లైంగిక వాంఛలు ఎక్కువవగా ఉంటాయి. ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది.
ఆర్సనిక్ ఆల్బమ్...
డయాబెటిస్‌కి ముఖ్యమైన ఔషధం. ఆర్సనిక్ ఆల్బమ్ వ్యక్తిత్వం ...వీరికి చాలా ఆందోళన ఉంటుంది. ప్రతీ చిన్న విషయానికి ఎక్కువగా ఆందోళన చెందుతారు. వీరు ఎక్కువ శుభ్రత పాటిస్తుం టారు. మానసిక ఆందోళనలకు గురైన వారికి, వ్యాపారంలో ఒడి దొడుకులు ఉన్న వారికి ఉపయోగపడుతుంది.
సల్ఫర్...
- దీని వ్యక్తిత్వం... చాలా కోపిష్టులై ఉంటారు. వీరికి మానసిక ఆం దోళనలు, వ్యాపార సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీరు ఎక్కువగా తీపి పదార్థాలు ఇష్టపడుతుంటారు. వీరికి అతిగా భక్తి ఉంటుంది. అరికాళ్ళ మంటలు, తిమ్మిర్లు ఎక్కువగా ఉంటా యి. హోమియోలో పైన పేర్కొన్న మందులు కాకుండా ఆసిడ్‌ఫాస్, ఇగ్ని షియా, కాల్కేరియా, కాస్టికిమ్, నక్స్‌వామికా లాంటి మందులు ఉన్నాయి. పైన పేర్కొన్న మందులను మంచి హోమియోవైద్యుడిని సంప్రదిం చి వాడితే ఫలితం త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. సొంత వైద్యం చేయడం వలన ఎలాంటి ఫలితం కనిపించదు.
- లక్షణాలు...
- ఆకలి ఎక్కువ కావడం
- దాహం ఎక్కువగా ఉండడం
- మూత్ర విసర్జన ఎక్కువగా ఉండడం
- బరువు తగ్గడం
- నీరసం
జాగ్రత్తలు... - ఆహార నియామాలు పాటించడం
- కొవ్వు పదార్థాలు తగ్గించడం
- వ్యాయామం, యోగా చేయడం
- మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండడం మంచిది.
కారణాలు... - వంశపారంపర్యం
- మానసిక ఒత్తిడి
- మద్యపానం
- అధిక బరువు
- వ్యాయామం లేకపోవడం
- స్టెరాయిడ్స్ వాడడం
దుష్ఫలితాలు... - మూత్రకోశ వ్యాధులు
- కంటివ్యాధులు
- కాళ్ళు, చేతులు తిమ్మిరి, మంట పట్టడం
- సెక్స్‌లో బలహీనత (శీఘ్రస్ఖలనం, అంగస్తంభన లోపాలు)
No comments:
Post a Comment