
స్థూలకాయంతో డయాబెటిస్ ఎందుకు...?
డయాబెటిస్‌కు దారితీసే సమస్యల్లో అత్యంత ప్రధానమైనది స్థూలకాయం (ఒబేసిటీ). ఒక పరిశీలన ప్రకారం... డయాబెటిస్ (టైప్-2) ఉన్నవాళ్లలో 90 శాతం మంది స్థూలకాయం కలిగి ఉంటారు. మన భారతీయుల్లో పొట్ట దగ్గర కొవ్వు పెరగడం కూడా డయాబెటిస్‌కు దారితీసేందుకు కారణాల్లో ఒకటి. ఒళ్లు పెరుగుతున్న కొద్దీ ఆ పెరుగుదలకు అనుగుణంగా శరీరమంతటా చక్కెర గ్లూకోజ్‌ని నియంత్రించాల్సిన బాధ్యత ప్యాంక్రియాస్ గ్రంథిది. అయితే ఆ పెరిగిన బరువు మేరకు అక్కడ కూడా గ్లూకోజ్‌ను నియంత్రించేందుకు అవసరమైనంత ఇన్సులిన్‌ను ప్యాంక్రియాస్ ఉత్పత్తి చేయలేకపోవడంతో డయాబెటిస్ వస్తుంది.
ఇప్పుడు ఉన్న చికిత్స...

అసలు లేకుండా చేయవచ్చా... ?
మాటిమాటికీ మందులు తీసుకోకుండా ఏవైనా శస్త్రచికిత్స మార్గాల ద్వారా అసలు డయాబెటిస్‌ను పూర్తిగా లేకుండా చేయవచ్చా?... రోగులు అడిగే ప్రశ్నకు సమాధానం కోసం పరిశోధన రంగంలో గత మూడు దశాబ్దాల నుంచి కొంత కృషి జరుగుతోంది. బరువును తగ్గించే శస్త్రచికిత్స చేయడం ద్వారా డయాబెటిస్‌ను రాకుండా చేయవచ్చా అని డాక్టర్లు పరిశీలిస్తున్నారు. ఇందుకు బేరియాట్రిక్ శస్త్రచికిత్సను ఒక సాధనంగా చెబుతున్నారు. ఇలా శస్త్రచికిత్స చేసి బరువు నియంత్రించిన సందర్భాల్లో దాదాపు 70 శాతం కేసుల్లో డయాబెటిస్‌ను పూర్తిగా అరికట్టగలిగారు. ఇక మరో 20 శాతం కేసుల్లో తీసుకోవాల్సిన మందుల మోతాదును గణనీయంగా తగ్గించగలిగారు.
శస్త్రచికిత్స ప్రొసిజర్లు :
స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ: ఇది లాపరోస్కోపిక్ ప్రక్రియ ద్వారా (అంటే తక్కువ గాటుతో) నిపుణులు చేసే అతి సాధారణ శస్త్రచికిత్స. ఇందులో ఆహారకోశాన్ని 70 శాతం మేరకు తీసివేస్తారు. దాంతో తీసుకునే ఆహారం పరిమాణం గణనీయంగా తగ్గిపోతుంది.
గ్యాస్ట్రిక్ బైపాస్: సాధారణంగానైతే... మనం తీసుకునే ఆహారం అన్నవాహిక నుంచి అన్నకోశానికి వెళ్తుంది. కానీ... ఈ ప్రక్రియలో అన్నవాహికలోకి కాకుండా పేగుల్లోకే వెళ్లేలా బైపాస్ చేస్తారు.
స్లీవ్ విత్ ఇలియల్ ఇంజర్‌పొజిషన్: ఇందులో స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ చేయడంతో పాటు చిన్న పేగుల ప్రారంభభాగమైన ఇలియమ్‌నూ ఆహారం బైపాస్ చేసేలా సర్జరీ చేస్తారు. అయితే ప్రస్తుతం ఈ శస్త్రచికిత్స ప్రయోగదశలోనే ఉంది.
శస్త్రచికిత్సలతో ప్రయోజనం ఎలా...

‘ఫోర్‌గట్ థియరీ’ పద్ధతి ద్వారా సాధించే ప్రయోజనాలు

బరువు ఎక్కువగా ఉన్నవారిలో ఆ బరువుకు తగినంత ఇన్సులిన్ దొరకక పోవచ్చు. శస్త్రచికిత్స ద్వారా తీయాల్సినంత తీసి, ఇన్సులిన్ సరిపోయేలా చూడవచ్చు.
ఆకలికి కారణమైన ‘ఘ్రెలిన్’ అనే హార్మోన్‌పాళ్లను తగ్గించి, ఆకలిని సాధ్యమైనంత తగ్గించడం.
ఈ శస్త్రచికిత్స వల్ల ఆహారం వెంటనే చిన్న పేగుల్లోని ఇలియమ్‌లోకి వెళ్తుంది. ఫలితంగా అక్కడ జీఎల్‌పీ (గ్లూకగాన్ లైక్ పెప్టైడ్) అనే హార్మోన్ స్రావం పెరుగుతుంది. అది చక్కెరనియంత్రణలోఇన్సులిన్‌లా దోహదపడుతుంది.
‘హైండ్‌గట్ థియరీ’ పద్ధతి ద్వారా సాధించే ప్రయోజనాలు

ఈ శస్త్రచికిత్సలోనూ ఆహారాన్ని ఆహారకోశం నుంచి చిన్నపేగుల ప్రవేశమార్గమైన ఇలియమ్‌లోకి వెంటనే వెళ్లేలా చేస్తారు.
ఫలితంగా జీఎల్‌పీ (గ్లూకగాన్ లైక్ పెప్టైడ్) అనే హార్మోన్ ఎక్కువగా స్రవించేలా చూస్తా రు. దాంతో చక్కెర పాళ్లు పెంచే గ్జైకోజెన్ ఉత్పత్తి తగ్గుతుంది. చక్కెరపాళ్లు తగ్గించే హార్మోన్ ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది.
మరికొన్ని అంశాలు :
దాదాపు 60 శాతం నుంచి 80 శాతం కేసుల్లో మంచి ప్రయోజనాలు.
చాలామందిలో ఇన్సులిన్ తీసుకోవడం దాదాపు ఆపివేయడం లేదా మోతాదును గణనీయంగా తగ్గించడం చేయవచ్చు.
డయాబెటిస్ వచ్చేందుకు ఆస్కారం ఉన్న చాలామందిలో శస్త్రచికిత్సతో డయాబెటిస్‌ను నివారించేందు ఆస్కారం ఎక్కువ.
శస్త్రచికిత్సల వల్ల అర్లీ డయాబెటిస్‌తో వచ్చే నెఫ్రోపతి, రెటినా వ్యాధులు, గుండె కండరానికి వచ్చే ముప్పు, ఫాటీ లివర్, అర్లీ సిర్రోసిస్ వంటి సమస్యలను నివారించవచ్చు.
సర్జరీ సత్ఫలితాలు ఇస్తే... దీర్ఘకాలం మందులు వాడాల్సిన అవసరం రాకుండా శస్త్రచికిత్సతోనే పరిస్థితి చక్కబడుతుంది.