Tuesday, August 30, 2011

చక్కెరకు కోత * శస్త్రచికిత్సతోనూ డయాబెటిస్ సమస్యను పరిష్కరించేందుకు అవకాశం

రక్తంలో చక్కెర పాళ్లను పెంచే ‘డయాబెటిస్’ ఎన్నో అవస్థలకు కారణం. దాన్ని నియంత్రణలో ఉంచుకోకపోవడం వల్ల మరెన్నో ప్రాణాంతక పరిస్థితులు రావచ్చు. ఇప్పటివరకూ మందులు, ఇన్సులిన్ వంటి ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే కొందరి విషయంలో శస్త్రచికిత్సతోనూ డయాబెటిస్ సమస్యను పరిష్కరించేందుకు అవకాశం ఉంది. దాంతో దీర్ఘకాలికంగా మందులు తీసుకోవడాన్ని చాలా కేసుల్లో నివారించవచ్చు. డయాబెటిస్ సమస్యలకు క్రమంగా ఆదరణ పొందుతున్న సర్జికల్ ప్రక్రియలపై అవగాహన కల్పించేదే ఈ కథనం.

ఏదైనా తినగానే రక్తంలోకి చక్కెర గ్లూకోజ్ రూపంలో శక్తి విడుదల అవుతుంది. అందుకే డయాబెటిస్‌ను పరగడపున నిర్వహించే రక్త పరీక్షల్లోని చక్కెరపాళ్లను బట్టి నిర్ణయిస్తారు. పరగడుపున చేసే పరీక్షలో (ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ స్థాయులు) 105 కంటే ఎక్కువగా ఉంటే చక్కెరను నియంత్రించడానికి మందులు వాడాల్సి ఉంటుంది. ఎందుకంటేనియంత్రణ లేకుండా రక్తంలో చక్కెర పెరగడం వల్ల సూక్ష్మ రక్తనాళికలు దెబ్బతినడం ద్వారా కిడ్నీ సమస్యలు మొదలుకొని ఎన్నో కాంప్లికేషన్స్‌కు దారితీయవచ్చు. పక్షవాతం, రక్తపోటు వంటి జబ్బులు మొదలుకొని గ్యాస్ట్రోపతి, అంగస్తంభన సరిగా లేకపోవడం వంటి సమస్యలు రావచ్చు.

స్థూలకాయంతో డయాబెటిస్ ఎందుకు...?

డయాబెటిస్‌కు దారితీసే సమస్యల్లో అత్యంత ప్రధానమైనది స్థూలకాయం (ఒబేసిటీ). ఒక పరిశీలన ప్రకారం... డయాబెటిస్ (టైప్-2) ఉన్నవాళ్లలో 90 శాతం మంది స్థూలకాయం కలిగి ఉంటారు. మన భారతీయుల్లో పొట్ట దగ్గర కొవ్వు పెరగడం కూడా డయాబెటిస్‌కు దారితీసేందుకు కారణాల్లో ఒకటి. ఒళ్లు పెరుగుతున్న కొద్దీ ఆ పెరుగుదలకు అనుగుణంగా శరీరమంతటా చక్కెర గ్లూకోజ్‌ని నియంత్రించాల్సిన బాధ్యత ప్యాంక్రియాస్ గ్రంథిది. అయితే ఆ పెరిగిన బరువు మేరకు అక్కడ కూడా గ్లూకోజ్‌ను నియంత్రించేందుకు అవసరమైనంత ఇన్సులిన్‌ను ప్యాంక్రియాస్ ఉత్పత్తి చేయలేకపోవడంతో డయాబెటిస్ వస్తుంది.

ఇప్పుడు ఉన్న చికిత్స...

రక్తంలో చక్కెర పాళ్లను నోటి ద్వారా మందులు ఇవ్వడం లేదా ఇంజెక్షన్ ద్వారా ఇన్సులిన్ ఇవ్వడం ఇప్పుడు సంప్రదాయికంగా జరుగుతున్న ప్రక్రియ. దీనికి తోడు రక్తంలో చక్కెరను పెంచే ఆహారాన్ని నివారించడం కూడా మామూలే. అయితే ఒకసారి డయాబెటిస్ కనిపిస్తే దానికి ఇలా నియంత్రణ మార్గాల తప్ప పూర్తిగా డయాబెటిస్ లేకుండా చేయడం సాధ్యం కాదు.

అసలు లేకుండా చేయవచ్చా... ?

మాటిమాటికీ మందులు తీసుకోకుండా ఏవైనా శస్త్రచికిత్స మార్గాల ద్వారా అసలు డయాబెటిస్‌ను పూర్తిగా లేకుండా చేయవచ్చా?... రోగులు అడిగే ప్రశ్నకు సమాధానం కోసం పరిశోధన రంగంలో గత మూడు దశాబ్దాల నుంచి కొంత కృషి జరుగుతోంది. బరువును తగ్గించే శస్త్రచికిత్స చేయడం ద్వారా డయాబెటిస్‌ను రాకుండా చేయవచ్చా అని డాక్టర్లు పరిశీలిస్తున్నారు. ఇందుకు బేరియాట్రిక్ శస్త్రచికిత్సను ఒక సాధనంగా చెబుతున్నారు. ఇలా శస్త్రచికిత్స చేసి బరువు నియంత్రించిన సందర్భాల్లో దాదాపు 70 శాతం కేసుల్లో డయాబెటిస్‌ను పూర్తిగా అరికట్టగలిగారు. ఇక మరో 20 శాతం కేసుల్లో తీసుకోవాల్సిన మందుల మోతాదును గణనీయంగా తగ్గించగలిగారు.

శస్త్రచికిత్స ప్రొసిజర్లు :

స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ: ఇది లాపరోస్కోపిక్ ప్రక్రియ ద్వారా (అంటే తక్కువ గాటుతో) నిపుణులు చేసే అతి సాధారణ శస్త్రచికిత్స. ఇందులో ఆహారకోశాన్ని 70 శాతం మేరకు తీసివేస్తారు. దాంతో తీసుకునే ఆహారం పరిమాణం గణనీయంగా తగ్గిపోతుంది.

గ్యాస్ట్రిక్ బైపాస్:
సాధారణంగానైతే... మనం తీసుకునే ఆహారం అన్నవాహిక నుంచి అన్నకోశానికి వెళ్తుంది. కానీ... ఈ ప్రక్రియలో అన్నవాహికలోకి కాకుండా పేగుల్లోకే వెళ్లేలా బైపాస్ చేస్తారు.

స్లీవ్ విత్ ఇలియల్ ఇంజర్‌పొజిషన్:
ఇందులో స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ చేయడంతో పాటు చిన్న పేగుల ప్రారంభభాగమైన ఇలియమ్‌నూ ఆహారం బైపాస్ చేసేలా సర్జరీ చేస్తారు. అయితే ప్రస్తుతం ఈ శస్త్రచికిత్స ప్రయోగదశలోనే ఉంది.

శస్త్రచికిత్సలతో ప్రయోజనం ఎలా...

కొన్ని డయాబెటిస్ శస్త్రచికిత్సల ద్వారా రక్తంలో చక్కెరపాళ్లు పెరగకుండా ఉండే విషయాన్ని డాక్టర్లు పరిశీలించారు. సాంప్రదాయికంగా ఇచ్చే మందులతో రక్తంలో చక్కెరపాళ్లను నియంత్రించడానికి ప్రత్యామ్నాయంగా శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ‘ఫోర్‌గట్ థియరీ’ అనే ఒక శస్త్రచికిత్స పద్ధతితోనూ, ‘హైండ్ గట్ థియరీ’ అనే మరో తరహా పద్ధతితోనూ డయాబెటిస్‌ను పూర్తికాలం రాకుండా చేయవచ్చని బేరియాటిక్ సర్జన్స్ పేర్కొంటున్నారు.

‘ఫోర్‌గట్ థియరీ’ పద్ధతి ద్వారా సాధించే ప్రయోజనాలు

మనం తీసుకున్న ఆహారం ఆహారకోశంలో చేరి అక్కడ కాసేపు ఉంటుంది. దాన్ని అక్కడ నిలవకుండా చేయడానికి ఆహారకోశం పై భాగాన్ని (ఫోర్ గట్‌ను) శస్త్రచికిత్సతో తగ్గిస్తారు. దాంతో కడుపులో ఎక్కువ ఆహారం పోగుకావడం తగ్గి రక్తంలోకి విడుదల అయ్యే చక్కెర కూడా తగ్గుతుంది.

బరువు ఎక్కువగా ఉన్నవారిలో ఆ బరువుకు తగినంత ఇన్సులిన్ దొరకక పోవచ్చు. శస్త్రచికిత్స ద్వారా తీయాల్సినంత తీసి, ఇన్సులిన్ సరిపోయేలా చూడవచ్చు.


ఆకలికి కారణమైన ‘ఘ్రెలిన్’ అనే హార్మోన్‌పాళ్లను తగ్గించి, ఆకలిని సాధ్యమైనంత తగ్గించడం.


ఈ శస్త్రచికిత్స వల్ల ఆహారం వెంటనే చిన్న పేగుల్లోని ఇలియమ్‌లోకి వెళ్తుంది. ఫలితంగా అక్కడ జీఎల్‌పీ (గ్లూకగాన్ లైక్ పెప్టైడ్) అనే హార్మోన్ స్రావం పెరుగుతుంది. అది చక్కెరనియంత్రణలోఇన్సులిన్‌లా దోహదపడుతుంది.


‘హైండ్‌గట్ థియరీ’ పద్ధతి ద్వారా సాధించే ప్రయోజనాలు

ఈ మార్గంలో కడుపులోని కింది భాగం (హైండ్ గట్)ను తగ్గిస్తారు. దాంతో కడుపు త్వరగా ఖాళీ కావడం అనే ప్రక్రియ తగ్గుతుంది. ఈ పద్ధతిలో ఈ కింది ప్రయోజనాలు సాధిస్తారు.

ఈ శస్త్రచికిత్సలోనూ ఆహారాన్ని ఆహారకోశం నుంచి చిన్నపేగుల ప్రవేశమార్గమైన ఇలియమ్‌లోకి వెంటనే వెళ్లేలా చేస్తారు.


ఫలితంగా జీఎల్‌పీ (గ్లూకగాన్ లైక్ పెప్టైడ్) అనే హార్మోన్ ఎక్కువగా స్రవించేలా చూస్తా రు. దాంతో చక్కెర పాళ్లు పెంచే గ్జైకోజెన్ ఉత్పత్తి తగ్గుతుంది. చక్కెరపాళ్లు తగ్గించే హార్మోన్ ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది.


మరికొన్ని అంశాలు :

దాదాపు 60 శాతం నుంచి 80 శాతం కేసుల్లో మంచి ప్రయోజనాలు.

చాలామందిలో ఇన్సులిన్ తీసుకోవడం దాదాపు ఆపివేయడం లేదా మోతాదును గణనీయంగా తగ్గించడం చేయవచ్చు.


డయాబెటిస్ వచ్చేందుకు ఆస్కారం ఉన్న చాలామందిలో శస్త్రచికిత్సతో డయాబెటిస్‌ను నివారించేందు ఆస్కారం ఎక్కువ.


శస్త్రచికిత్సల వల్ల అర్లీ డయాబెటిస్‌తో వచ్చే నెఫ్రోపతి, రెటినా వ్యాధులు, గుండె కండరానికి వచ్చే ముప్పు, ఫాటీ లివర్, అర్లీ సిర్రోసిస్ వంటి సమస్యలను నివారించవచ్చు.


సర్జరీ సత్ఫలితాలు ఇస్తే... దీర్ఘకాలం మందులు వాడాల్సిన అవసరం రాకుండా శస్త్రచికిత్సతోనే పరిస్థితి చక్కబడుతుంది.

No comments:

Historical Introduction

Historical Introduction:

Diabetes mellitus or Madhumeham has been known for centuries as a disease related to poor functioning of the Pancreatic gland . Person with diabetes have to much sugar in blood and urine. However, there is no need to worry, since diabetes can be kept under control with certain changes in the lifestyle, food intake, exercise & regular intake of prescribed medicines.

Diabetes mellitus is a chronic metabolic disorder that prevents the body to utilise glucose completely or partially. It is characterized in the blood and alteration in carbohydrate, protein and fat metabolism. This can be due to failure in the formation of insulin or liberation or action.

Few Facts You Should Know
  • India is world's Diabetes Capital
  • Diabetes is a killer disease
  • Every 10 seconds a person dies from diabetes-related causes.
  • In 2025, 80% of all cases of diabetes will be in low- and middle-income countries.
  • Diabetes is not a old age disease.
  • 80% of Type 2 diabetes is preventable


Since insulin is produced by the Beta cells of the islets of langerhans, any receding in the number of functioning cells will decrease the amount of insulin that can be synthesised. Many diabetics can produce sufficient insulin but some stimulus to the islets tissue is needed in order that secretion can take place.

“Diabetes Mellitus is a word derived form Greek word Diabetes which means Siphon, Mellitus means Sweet i.e, “ flowering of sweet liquid.”