Monday, December 12, 2011

డయాబెటిస్‌కి దివ్య ఔషదం ‘ హోమియో ’

features2 
మధుమేహం లేదా షూగర్‌ వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్‌ మెల్టెటిస్‌ అని వ్యవహరిస్తారు. నేటి సమాజంలో మానసిక ఒత్తిడి, ఆందోళనలు, అధిక శ్రమ వలన యుక్తవయస్సులోనే మనం మధుమేహ వ్యాధిని ఎక్కువగా చూస్తున్నాం. శరీరంలో పాంక్రియట్రిస్  (కో్లమగ్రంథి) అనే గ్రంథి ఉంటుంది. ఇది ఇన్సులిన్‌ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇన్సులిన్‌ రక్తం ద్వారా చెక్కరను శరీరంలోని వివిధ భాగాలకు అందిస్తూ సమర్థవంతమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. ఈ హార్మోను స్థాయి తగ్గడం లేదా అనియంత్రత వలన రక్తంలో చక్కర  పేరుకొని పోయి వ్యాధిగా మారే అవకాశం ఉంటుంది. దీని వలన రక్తంలో, మూత్రంలో మధుమేహ లక్షణాలు కనబడుతాయి.

డయాబెటిస్‌ ముఖ్యంగా రెండు రకాలు.


టైప్‌1 డయాబెటిస్‌:
features1 
క్లోమ గ్రంథిలోని ఐలెట్స్‌ ఆఫ్‌ లాంగర్‌ హాన్స్‌లో ఇన్సులిన్‌ ఉత్పత్తి చేసే బీటా కణాలు సంఖ్యలో తగ్గిపోవడం లేదా నశించడం వలన కలుగుతుంది. ఈ వ్యాధి పెద్దల్లో, పిల్లల్లోనూ రావచ్చు. కానీ చిన్న పిల్లల్లో వచ్చే ఈ వ్యాధిని జువైనల్‌ డయాబెటిస్‌ అంటారు.

టైప్‌ 2 డయాబెటిస్‌:
ఈ రకం ఇన్సులిన్‌ నిరోధకత వలన కలుగుతుంది. కణత్వచంలో ఉండే ఇన్సులిన్‌ రెసిస్టర్లు వివిధ శరీరభాగాల్లో సరిగా విధిని నిర్వర్తించకపోవడం దీనికి ముఖ్యకారణంగా భావిస్తారు.
http://t0.gstatic.com/images?q=tbn:ANd9GcTeTYXj_QyC-okZSovg-afOmRnACD03rssQxGjbjAGYaZ1x5wIDTmE0XbZP
హోమియో చికిత్స విధానం...
డయాబెటిస్‌కి సంబంధించి హోమియోపతిలో అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి. హోమియో వైద్యవిధానంలో వ్యాధి లక్షణాలు, వ్యక్తి మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. హోమియోలో మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి మందులు నిర్ధారణ చేయడం జరుగుతుంది. దీన్ని మనం ఇండివిడ్యువాలిటీ అంటాం. దీని ద్వారా జెనిటిక్‌ కానిస్టిట్యూషనల్‌ మెడిసిన్‌ను ఎంచు కోవడం జరుగుతుంది.
http://old.tehrantimes.com/News/11207/08_DM.jpg
హోమియో చికిత్స వల్ల కలిగే లాభాలు...
  • షుగర్‌ను కంట్రోల్‌ చేయవచ్చు
  • షుగర్‌ వల్ల వచ్చే దుష్ఫలితాలను అరికట్టవచ్చు
  • మనిషి మానసిక ఆందోళనకు గురైనప్పుడు శరీర అవయవాలపై ప్రభావం పడకుండా చూస్తుంది
  • డయాబెటిస్‌ను ముందుగానే గుర్తించినప్పుడు హోమియో మందులు వాడడం వలన ఎలాంటి ఇతర మందులు వాడకుండా చేస్తుంది.
  • హోమియో మందులు వాడడం వలన (లేక) ఇతర మందులతో పాటు హోమియో మందులు వాడడం వలన ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు
  • హోమియో మందులు: లైకోపోడియం...  
     ఈ మందు డయాబెటిస్‌కు చక్కగా పని చేస్తుంది. ఈ మందు ఎక్కు వగా మానసిక ఆందోళనకు గురైన వారికి ఉపయోగపడుతుంది. లైకోపోడియం వ్యక్తిత్వం పిరికితనం. ఎక్కువగా తీపిపదార్థాలను ఇష్టపడుతారు. వీరిలో లైంగిక వాంఛలు ఎక్కువవగా ఉంటాయి. ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. ఆర్సనిక్‌ ఆల్బమ్‌... డయాబెటిస్‌కి ముఖ్యమైన ఔషధం. ఆర్సనిక్‌ ఆల్బమ్‌ వ్యక్తిత్వం ...వీరికి చాలా ఆందోళన ఉంటుంది. ప్రతీ చిన్న విషయానికి ఎక్కువగా ఆందోళన చెందుతారు. వీరు ఎక్కువ శుభ్రత పాటిస్తుం టారు. మానసిక ఆందోళనలకు గురైన వారికి, వ్యాపారంలో ఒడి దొడుకులు ఉన్న వారికి ఉపయోగపడుతుంది. సల్ఫర్‌... features3 
    దీని వ్యక్తిత్వం... చాలా కోపిష్టులై ఉంటారు. వీరికి మానసిక ఆం దోళనలు, వ్యాపార సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీరు ఎక్కువగా తీపి పదార్థాలు ఇష్టపడుతుంటారు. వీరికి అతిగా భక్తి ఉంటుంది. అరికాళ్ళ మంటలు, తిమ్మిర్లు ఎక్కువగా ఉంటా యి. హోమియోలో పైన పేర్కొన్న మందులు కాకుండా ఆసిడ్‌ఫాస్‌, ఇగ్ని షియా, కాల్కేరియా, కాస్టికిమ్‌, నక్స్‌వామికా లాంటి మందులు ఉన్నాయి. పైన పేర్కొన్న మందులను మంచి హోమియోవైద్యుడిని సంప్రదిం చి వాడితే ఫలితం త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. సొంత వైద్యం చేయడం వలన ఎలాంటి ఫలితం కనిపించదు.
http://img.tradeindia.com/fp/1/571/069.jpg
    లక్షణాలు...
    • ఆకలి ఎక్కువ కావడం
    • దాహం ఎక్కువగా ఉండడం
    • మూత్ర విసర్జన ఎక్కువగా ఉండడం
    • బరువు తగ్గడం
    • నీరసం
      జాగ్రత్తలు...
    • ఆహార నియామాలు పాటించడం
    • కొవ్వు పదార్థాలు తగ్గించడం
    • వ్యాయామం, యోగా చేయడం
    • మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండడం మంచిది.
      కారణాలు...
    • వంశపారంపర్యం
    • మానసిక ఒత్తిడి
    • మద్యపానం
    • అధిక బరువు
    • వ్యాయామం లేకపోవడం
    • స్టెరాయిడ్స్‌ వాడడం
      దుష్ఫలితాలు...
    • మూత్రకోశ వ్యాధులు
    • కంటివ్యాధులు
    • కాళ్ళు, చేతులు తిమ్మిరి, మంట పట్టడం
    • సెక్స్‌లో బలహీనత (శీఘ్రస్ఖలనం, అంగస్తంభన లోపాలు)
    • http://www.madeitsimple.com/wp-content/uploads/2009/10/healthy_living_physical_mental_satisfaction.gif 
    • http://suryaa.com/Main/gallery/2011/Dec/12/chandrasekhar.jpg

Sunday, November 13, 2011

తీపి వ్యాధి... ఎంతో చేదు * నవంబర్‌ 14న ‘డయాబెటిక్‌ డే’ ను పురస్కరించుకొని మధుమేహంపై ప్రత్యేక కథనం...

చక్కెర వ్యాధి... ఈ వ్యాధికి పేరులోనే చక్కెర... దాని ఫలితమంతా ఎంతో చేదు. ఆ వ్యాధి వస్తే చక్కెరకు ఇక దాదాపుగా దూరమైపోయినట్లే. ప్రపంచ మధుమేహ రాజధానిగా భారత్‌ మారిపోయింది. మధుమేహ సమస్య భారత్‌లో అత్యధికంగా ఉంది. ప్రస్తుతం ప్రపంచంలో 15 కోట్ల మంది, దేశంలో 4 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు అంచనా. 2025 నాటికి దేశంలో ఈ వ్యాధిపీడితుల సంఖ్య 7 కోట్లకు చేరుకోగలదని భావిస్తున్నారు. భారత్‌లోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఈ వ్యాధి మరింత అధికంగా ఉంది.
హైదరాబాద్‌ మధుమేహానికీ రాజధానిగా ఉంటోంది. మధుమేహం కారణంగా ప్రతీ నిమిషానికి ఆరుగురు మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 20 మరణాల్లో ఒకటి మధుమేహం కారణంగానే చోటు చేసుకుంటున్నది. మధుమేహం, సంబంధిత వ్యాధుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 32 లక్షల మంది మరణిస్తున్నారు.మధుమేహంను నిశ్శబ్దహంతకిగా అభివర్ణిస్తారు. దీన్ని నివారించడం అంత తేలిక కానప్పటికీ, కొన్ని రకాల విధివిధానాలు పాటించడం ద్వారా దీన్ని సమర్థంగా ఎదుర్కోవచ్చు.


Insulin2 
మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్‌ మెల్లిటస్‌ అని వ్యవహరిస్తారు. డయాబెటిస్‌ అని కూడా వ్యవహరితమయ్యే ఈ వ్యాధి, ఇన్సులిన్‌ హార్మోన్‌ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియం త్రిత మెటబాలిజం, రక్తంలో అధిక గ్లూకోజ్‌ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మ త. అతిమూత్రం (పాలీయూరియా), దాహం ఎక్కువగా వేయడం (పాలీడిప్సియా), మంద గించిన చూపు, కారణం లేకుండా బరువు తగ్గడం, బద్ధకం దీని ముఖ్య లక్షణాలు. మధు మేహం లేదా చక్కెర వ్యాధిని సాధారణంగా రక్తంలో మితి మీరిన చక్కెర స్థాయిని బట్టి గుర్తిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం భారత దేశం, చైనా, అమెరికాలలో అత్యధికంగా ఈ వ్యాధి ప్రబలి ఉన్నది. ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించే మందులు లేవు. జీవితాంతం తగిన జాగ్రత్తలు తీసుకొన్నట్లయి తే దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యం.

ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన డయాబెటిస్‌ మెల్లిటస్‌.. 3 రకాలు..

అన్ని రకాల మధుమేహాలకు మూల కారణం క్లోమ గ్రంధిలోని బీటా కణాలు పెరిగిన గ్లూకో స్‌ స్థాయిని అరికట్టడానికి సరిపడినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడమే. మొదటి రకం డయాబెటిస్‌ సాధారణంగా బీటా కణాలను మన శరీరం స్వయంగా నాశ నం చేయడం (ఆటోఇమ్యూనిటీ) వల్ల కలుగుతుంది. రెండవ రకం డయాబెటిస్‌లో ఇన్సులి న్‌ నిరోధకత వస్తుంది. దీనివల్ల అధికంగా ఇన్సులిన్‌ కావలసి వస్తుంది, బీటా కణాలు ఈ డిమాండ్‌ తట్టుకోలేనప్పుడు డయాబెటిస్‌ కలు గుతుంది. జెస్టేషనల్‌ డయాబెటిస్‌ (గర్భిణుల్లో వచ్చే మధుమేహం) లో కూడా ఇన్సులిన్‌ నిరో ధకత అగుపిస్తుంది.

జెస్టేషనల్‌ డయాబెటిస్‌ సర్వసాధారణంగా ప్రసవం తర్వాత తగ్గిపోతుంది. మొదటి రకం, రెండవ రకం మధుమేహాలు మాత్రం దీర్ఘకాలికంగా ఉంటాయి. 1921లో ఇన్సున్‌ అందుబాటులోకి రావడంతో అన్ని రకాల ను నియంత్రించడం సాధ్యమయ్యింది. ఆహా ర అలవాట్ల మార్పు కూడా భాగమయినప్పటి కీ, ఇన్సులిన్‌ ఉత్పత్తి లేని మొదటి రకాన్ని నియంత్రించడానికి ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌ ఇవ్వ టం తప్పనిసరి మార్గం. రెండవ రకం ఆహార అలవాట్ల మార్పు, ఆంటీడయాబెటిక్‌ మందు ల వాడకం వల్ల, అప్పుడప్పుడు ఇన్సులిన్‌ వాడకం వల్ల నియంత్రించవచ్చు.

వ్యాధి లక్షణాలు...
మధుమేహం యొక్క లక్షణాలలో ’ప్రదాయిక త్రయంగా పాలీయూరియా (అతిగా మూత్రం రావడం), పాలీడిప్సియా (దాహం వేయడం), పాలీఫాజియా (అతిగా ఆకలి వేయడం) అను వాటిని చెప్పుతారు. మొదటి రకం డయాబెటిస్‌లో ఈ లక్షణాలు త్వరగా అగుపిస్తాయి (ముఖ్యంగా చిన్న పిల్లలలో). కానీ, రెండవ రకంలో మాత్రం వ్యాధి లక్షణా లు చాలా నెమ్మదిగా మొదలవుతాయి, ఒక్కో సారి ఈ లక్షణాలేమీ కనిపించకపోవచ్చు కూ డా. మొదటి రకం డయాబెటిస్‌ వల్ల కొద్ది సమయంలోనే గుర్తించదగిన బరువు తగ్గడం (మామూలుగా తిన్నా, అతిగా తిన్నా కూడా), అలసట కలుగుతుంటాయి. ఒక్క బరువు తగ్గ డం తప్ప మిగతా అన్ని లక్షణాలు, సరిగా నియంత్రణలలో లేని రెండవ రకం డయా బెటిస్‌ రోగులలో కూడా కనిపిస్తాయి.

మూత్ర పిండాల సామర్థ్యాన్ని దాటి రక్తంలో గ్లుకోస్‌ నిలువలు పెరిగితే, ప్రాక్సిమల్‌ టుబ్యూల్‌ నుం డి గ్లూకోస్‌ రీఅబ్సార్ప్షన్‌ సరిగా జరగదు, కొం త గ్లూకోస్‌ మూత్రంలో మిగిలిపోతుంది. దీనివల్ల మూత్రం యొక్క ద్రవాభిసరణ పీడ నం పెరిగి నీటి రీఅబ్సార్ప్షన్‌ ఆగిపోతుంటుం ది, దానివల్ల మూత్రవిసర్జన ఎక్కువవుతుంది (పాలీయూరియా). కోల్పోయిన నీటి శాతాన్ని రక్తంలో పునస్థాపించడానికి శరీర కణాలలోని నీరు రక్తంలో చేరుతుంది, దీని వల్ల దాహం పెరుగుతుంది. ఎక్కువ కాలం రక్తంలో అధిక గ్లూకోస్‌ నిలువలు ఉండడం వల్ల కంటి లెన్స్‌ లో గ్లూకోస్‌ పేరుకుపోయి దృష్టి లోపాలను కలుగజేస్తుంది. చూపు మందగించడం అనేది మొదటి రకం డయాబెటిస్‌ ఉందేమో అనే అనుమానాన్ని లేవనెత్తడానికి ముఖ్య కారణం.

రోగుల్లో (ముఖ్యంగా టైప్‌ 1) డయాబెటిక్‌ కీటో అసిడోసిస్‌ కూడా ఉండే అవకాశాలున్నా యి. దీనివల్ల మెటబాలిజమ్‌ నియంత్రణ కోల్పోయి శ్వాశలో అసిటోన్‌ వాసన రావడం, శ్వాశవేగంగా పీల్చుకోవడం, కడుపులో నొప్పి మొదలగు లక్షణాలు అగుపిస్తాయి. ఈ పరిస్థి తి తీవ్రమైతే కోమా తద్వారా మరణం సంభ వించవచ్చు. అతి అరుదైనదైనా తీవ్రమైన టైప్‌ 2 లో కలిగే నాన్‌ కీటోటిక్‌ హైపర్‌ ఆస్మొలార్‌ కోమా శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం వల్ల కలుగుతుంది.

పాదాలు - జాగ్రత్తలు
చక్కెరవ్యాధి రోగుల్లో పాదాల సమస్యల వల్ల మరణించే వారి సంఖ్య ఎక్కువ. చాలా సంవ త్సరాలుగా పాదాల్లో రక్తప్రసరణ క్షీణించడం వలన, నరాల స్పర్శ తగ్గడం వల్ల గాయాలు ఏర్పడి, మానకపోవడం వల్ల పాదాలకు సమ స్యలు ఏర్పడుతాయి. న్యూరోపతీ, ఉపరితల రక్తనాళాల వ్యాధి, ఇన్ఫెక్షన్‌ వలన చక్కెర వ్యాధిగ్రస్తుల్లో పాదాల సమస్య తలెత్తుతుంది. మధుమేహం ఉన్న వారు కాళ్ళను పరిశుభ్రం గా ఉంచుకోవాలి. గోరువెచ్చటి నీటితో సబ్బు తో శుభ్రంగా కడగాలి. తరచుగా పాదాలను పరీక్షించుకోవాలి. చర్మం చెడిపోయినా, ను నుపుదనం కోల్పోయినా, డాక్టరును సంప్ర దించాలి.

కాలి వేళ్ళ మధ్యన పగుళ్ళు, ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. గోళ్ళను పరీక్షించు కోవాలి. గోళ్ళను వెంట వెంట కత్తిరించు కోవాలి. గోళ్ళ చుట్టూ ఎర్రదనం కన్పించినా, వాపు అనిపించినా డాక్టర్‌ను సంప్రదించాలి. కాళ్ళు పొడిబారకుండా నూనె రాసుకోవాలి. కాళ్ళు చల్లగా అనిపించినప్పుడు నెమ్మదిగా మర్ధన చేసి, వేడి వచ్చేలా చేయాలి. నీటి బుడగలు, పుళ్ళు, పగుళ్ళు లాంటివి వస్తే వెంట నే తగిన చికిత్స చేయించుకోవాలి. తప్పనిసరి గా అనువైన పాదరక్షలను ధరించాలి.

రక్తంలో చక్కెర శాతం తక్కువగా ఉంటే...
రక్తంలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటే చక్కె ర వ్యాధి అని అంటారు. ఈ శాతం తక్కువగా ఉండడం కూడా ప్రమాదకరం. దీనిని హైపో గ్లైసీమియా అంటారు. దీన్ని అశ్రద్ధ చేస్తే చాలా ప్రమాదం.

శరీరంలో చక్కెర నిల్వలు తగ్గిపోవడానికి కారణాలు:

- ఆహారం సరిగా తీసుకోకపోవడం, ఉపవాసాలు చేయడం.
- అనారోగ్యంగా ఉన్నప్పుడు అవసరానికి మించి వ్యాయామం, శారీరక శ్రమ చేయడం.
- నొప్పి నివారణ మందులు విచక్షణారహితంగా తీసుకోవడం.
- ఇన్సులిన్‌, యాంటీ డయాబెటిక్‌ మందులు ఎక్కువ మోతాదులో తీసుకోవడం.
- అధికంగా మత్తు పానీయాలు తీసుకోవడం.

రక్తంలో చక్కెర శాతం తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు:
WDD-logo 
ఈ లక్షణాలు ప్రతీ మనిషికి మారుతుంటాయి. ఒకే మనిషిలో విభిన్న లక్షణాలు కనిపిస్తుంటాయి.
- అతి ఆకలి, అతి చెమట, మూర్ఛపోవడం, బలహీనత, ఎక్కువగా గుండె కొట్టుకోవడం
- పెదవులకు తిమ్మిరి పట్టడం.
- చూపు మసకబారడం.
- తలనొప్పి, చేసే పనిపై శ్రద్ధ లేకపోవడం.
- తికమక పడడం. అలసిపోవడం, బద్దకం మొదలైనవి.

ఈ స్థితి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
- నాలుగు పూటలా మితంగా ఆహారం తీసుకోవాలి. (ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారం, రాత్రి భోజనం)
- కచ్చితమైన ఆహార సమయాలు పాటిస్తూ, సరైన సమయంలో మందులు వాడడం.

జాగ్రత్తలు
- ఈ పరిస్థితి కన్పించగానే రక్తంలోని చక్కెర నిల్వల స్థితి పెంచాలి. 3,4 చెంచా చక్కెర లేదా గ్లూకోజ్‌ తీసుకోవాలి
- వ్యాధిగ్రస్తులు ఎప్పుడూ కొంత చక్కెర లేదా గ్లూకోజ్‌ దగ్గర ఉంచుకోవాలి.
- అపస్మారక స్థితి వస్తే వెంటనే వైద్యశాలకు తరలించాలి.

చక్కెర వ్యాధిని అశ్రద్ధ చేస్తే వచ్చే ప్రమాదాలు అపస్మారక స్థితి (కోమా)..
ఈ వ్యాధి ఉన్న వారు కోమాలోకి వెళ్ళే అవ కాశం ఉంది. ఇది మామూలుగా రెండు రకాలు. మొదటిది రక్తంలో చక్కెర 400 మి. గ్రా. కన్నా ఎక్కువ కావడం, రెండవది 60 మి.గ్రా. తక్కువ కావడం.

చక్కెర శాతం 400 మి.గ్రా. కన్నా ఎక్కువ కావడం...
Fat_Manదీనినే డయాబెటిక్‌ కీటో అసిడోసిస్‌ అని కూడా అంటారు. ఈ స్థితిలో ఎక్కువగా దా హం, నాలుక తడారిపోవడం, మత్తుగా ఉండ డం, వాంతులు, పొత్తి కడుపునొప్పి, తల నొ ప్పి, తల తిరగడం, విపరీతమైన నీరసం, ఒ ళ్ళు నొప్పులు లక్షణాలుగా ఉంటాయి. ఈ సమయంలో వెంటనే డాక్టర్‌ను సంప్రదించా లి. ఈ దశలో కూడా తాత్సారం చేస్తే మరణా నికి దారి తీయవచ్చు.

రక్తంలో చక్కెర శాతం 60 మి.గ్రా కన్నా తగ్గడం...
దీన్నే లో - షుగర్‌ లేదా హైపోగ్లైసి మియా అంటారు. ఇలాంటప్పుడు చక్కెర, గ్లూకోజ్‌, తేనె, పండ్లరసం, తీపి లేదా పిండి పదార్థం వెంటనే తీసుకోవాలి.

రక్తనాళాలలో మార్పులు...
రక్తంలో చక్కెర శాతం పెరిగితే రక్తం చిక్కగా మారి కొంతకాలం తరువాత రక్తనాళాల రం ధ్రాలను చిన్నగా పూడ్చేస్తుంది. ఈ మార్పు ముఖ్యంగా మూత్రపిండాలకు (డయాబెటిక్‌ నెఫ్రోపతి), కళ్ళకు (డయాబెటిక్‌ రెటినోపతి), నరాలకు (డయాబెటిక్‌ న్యూరోపతి), గుండెకు (కరొనరి ఆర్టరీ త్రాంబోసిస్‌)కు సంబంధించి న రక్తనాళాలలో చోటు చేసుకుంటుంది. వీటి మూలంగా కాళ్ళవాపులు, కంటిచూపు తగ్గిపో వడం, తిమ్మిర్లు, అరికాళ్ళ మంటలు, కాళ్ళ గాయాలు మానకపోవడం, ఆయాసం వంటి వి అనిపిస్తాయి. ఒకసారి ఈ మార్పులు చో టు చేసుకుంటే తిరిగి యథాస్థితికి రావడం ష్టం. అందుకనే మధుమేహం ఉన్నవారు రక్తం లోని చక్కెర శాతాన్ని క్రమం తప్పకుండా పరీక్ష చేసుకుంటూ అదుపులో ఉంచుకోవాలి.

వ్యాధి నిర్ధారణ
మధుమేహ వ్యాధిని రక్త, మూత్రపరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు.
రక్తపరీక్ష: సాధారణంగా రక్తంలో చక్కెర శాతం 80 నుంచి 140 మి.గ్రా వరకు ఉంటుంది. ఇంత కన్నా ఎక్కువ ఉంటే చక్కెర వ్యాధి ఉన్నట్లే. ఖాళీ కడుపుతో ఉన్న ప్పుడు చక్కెర శాతం 60 నుంచి 90 ఎంజీ / డీఎల్‌, తిన్న తరువాత 110 నుంచి 140 ఎంజీ / డీఎల్‌ ఉండాలి. ఇంతకన్నా ఎక్కు వ ఉంటే చక్కెర వ్యాధి ఉన్నట్లే. ఈ పరీక్ష ద్వారా కచ్చితంగా వ్యాధిని నిర్ధారించవచ్చు.
మూత్రపరీక్ష: సాధారణంగా మూత్రంలో చక్కెర ఉండదు. ఒక వేళ మూత్రంలో చక్కెర ఉంటే వ్యాధి ఉన్నట్లే.

తీసుకోవలసిన జాగ్రత్తలు
exercisef 
చక్కెరవ్యాధిగ్రస్తులు ఆ జబ్బు గురించి అవగాహన పెంచుకోవాలి. ఇతర రోగులతో కలి సి తమకు తెలిసిన విషయా లను మిగిలిన వారితో పంచుకోవాలి. పాదాలు, మూత్ర పిండాలు, గుండె, నరాలు మొదలైన అవయ వాలపై ఈ వ్యాధి ప్రభావం ఎలా ఉంటుందో వీరు తెలుసుకోవాలి.

* రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యా యామం చేయాలి. తద్వారా శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి.
* భోజనానికి అరగంట ముందు మాత్ర లు వేసుకోవాలి. వాటిని ప్రతిరోజూ సరియై న సమయంలోనే వేసుకోవాలి. సమయ పాలన లేకపోతే మందులు వేసుకుంటున్నా శరీరంలో ఒక అపసవ్య స్థితి ఏర్పడుతుంది.
* ప్రతి రోజూ ఒక నిర్ణీత సమయంలోనే భోజనం చేయాలి.
* ఇన్సులిన్‌ వేసుకోవడంలోనూ కాల నియమాన్ని పాటించాలి.
* మధుమేహంలో కాళ్లల్లో స్పర్శజ్ఞానం పోయిందన్న విషయం చాలాకాలం వరకు తెలియదు. అందుకే వారు ఏటా ఒకసారి పాదాల్లో స్పర్శ ఎలా ఉందో తెలుసుకోవాలి. స్పర్శ లేకపోతే ప్రతి ఆరుమాసాలకు వీలైతే మూడు మాసాలకు ఒకసారి పరీక్ష చేయించాలి.

* పాదాల మీద చర్మం కందిపోవడం, గాయాలు, పుండ్లు, ఆనెలు ఏమైనా ఉన్నా యేమో గమనించాలి. డాక్టర్‌ సమక్షంలో అవసరమైన చికిత్స తీసుకోవాలి.
* గోళ్లు తీసే సమయంలో ఎక్కడా గాయం కాకుండా జాగ్రత్త వహించాలి. పాదాలను ప్రతి రోజూ గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి.
* ఇన్‌ఫెక్షన్లతో కాళ్లకు చీము పడితే చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాలి. డాక్టర్‌ సలహాతో యాంటీబయాటిక్స్‌, అవసరమైతే ఇన్సులిన్‌ తీసుకోవాలి.
* అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌ పరీక్షలు, అలాగే కళ్లు, కిడ్నీ పరీక్షలు కూడా డాక్టర్‌ సలహా మేరకు చేయించుకోవాలి.

fruts* మధుమేహం ఉన్న వారికి మూత్ర పిం డాలు దెబ్బతినే అవకాశం ఉంది. దీనివల్ల మూత్రంలో ఆల్బుమిన్‌ అనే ప్రొటీన్‌ విసర్జిం చబడుతుంది. అంతిమంగా ఇది కిడ్నీ దెబ్బ తినడానికి దారి తీస్తుంది. అందుకే ప్రతి మూడు మాసాలకు, ఆరు మాసాలకు పరీక్ష చేసి మూత్రంలో ఆల్బుమిన్‌ ఉందా లేదా కనుగొనాలి.
* మధుమేహం ఉన్న వారిలో గుండె కండ రాలకు రక్తాన్ని తీసుకొనిపోయే కరొనరీ రక్త నాళాలు మూసుకుపోయే ప్రమాదం ఉంది. అందుకే గుండె నొప్పి ఉన్నా లేకపోయినా ప్రతి ఏటా ఇసిజి, ట్రెడ్‌మిల్‌ పరీక్షలు చే యించుకోవడం అవసరం. అలాగే కొలెస్ట్రా ల్‌ పరిమాణాన్ని తెలిపే లిపిడ్‌ ప్రొఫైల్‌ పరీక్షలు చేయించాలి.
* ధాన్యాలు, పిండిపదార్థాలు తగ్గించి పీచు పదార్థాలు అధికంగా ఉండే కూరగా యలు ఎక్కువగా తీసుకోవాలి.

మానుకోవలసిన అలవాట్లు
* తీపి పదార్థాలు, ఐస్‌క్రీములు మానుకో వాలి. అతి పరిమితంగా తీసుకున్నప్పుడు అయితే, ఆరోజు మామూలుగా తీసు కునే ఆహార పదార్థాల మోతాదును బాగా తగ్గిం చాలి. అలాగే నూనె పదార్థాలు కూడా బాగా తగ్గించాలి.
* కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో శరీరంలో చక్కెర శాతం హఠాత్తుగా పెరిగిపోవచ్చు. అప్పుడు మాత్రలు ఆ స్థితిని అదుపు చేయలే కపోవచ్చు. అలాంటప్పుడు డాక్టర్‌ సూచిస్తే ఇన్సులిన్‌ తీసుకోవాలి. ఆ తరువాత చక్కెర అదుపులోకి వచ్చాక మళ్లీ మాత్రలకే పరిమి తం కావచ్చు. ఒకసారి ఇన్సులిన్‌ తీసుకుంటే జీవితాంతం ఇన్సులిన్‌ తీసుకోవలసి వస్తుం దన్నది సరికాదు. ఆ కారణంగా ఇన్సులిన్‌ తీసుకోవడానికి వెనుకాడకూడదు.
* పాదరక్షలు లేకుండా నడవకూడదు.
* పొగతాగడం పూర్తిగా మానుకోవాలి.
* మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవాలి.
* కొలెస్ట్రాల్‌ అధికంగా ఉండే కొవ్వు ఉన్న మాంసం, గుడ్లు తినడం మానుకోవాలి.

- డాక్టర్‌ అశోక్‌కుమార్‌
జనరల్‌ ఫిజీషియన్‌, డయాబెటిక్‌ స్పెషలిస్ట్‌, గ్లోబల్‌ హాస్పిటల్స్‌,
హైదరాబాద్‌ - 9440337017



ఆయుర్వేదంలో విముక్తి
ayurvedic-for-diabetes 
* చక్కెర వ్యాధిని అరికట్టడమనేది మందులు, జీవనశైలి, ప్రశాంత జీవనం లాంటి వాటి యొక్క కలయి క. ఆయుర్వేదంలో వాతజ, కఫజ, పిత్తజ శరీరధర్మాలతో దాదాపు 20 రకాల చక్కెర వ్యాధుల ను ప్రస్తావించారు. వీటిలో మూడు వంతుల చక్కెర వ్యాధులు తగ్గించడానికి వీలవుతుందని మాధవాచా ర్యులు పేర్కొన్నారు. అనువంశిక లక్షణాలు ఉన్న వారికి చికిత్స ద్వారా అప్పటి వరకే తగ్గుతుందని, జీవితకాలం మందులు వాడాల్సి ఉంటుందని తెలిపారు.

* భారతీయ ఆహారంలో తీపి, ఉప్పు, పులుపు, వగరు, చేదు, కారం లాంటి ఆరు రుచుల గురించి ప్రధానంగా పేర్కొన్నారు. ఆహారంలో తప్పని సరిగా ఆరు రుచులు ఉండాలన్నారు. చక్కెర వ్యాధిగ్రస్తులు కారం, వగరు, చేదు, రసాలు కలిగిన కూరగాయలు బాగా తీసుకోవలసి ఉంటుంది. శక్తిని ఇచ్చే అన్నం ఎక్కువగా తీసు కోకుండా, పొట్టు కలిగిన జొన్న రొట్టె, గోధుమ పుల్కాలు, సజ్జ రొట్టె తీసుకుంటే రక్తంలో చక్కెర శాతం పెరగకుండా ఉంటుంది.
* అలజడి, కోపం తగ్గించుకొని మానసిక ప్రశాంతత కలిగి ఉండాలి. యోగా, ధ్యానం, నడక లాంటివి చక్కెర వ్యాధి రాకుండా నిరోధిస్తాయి. ముఖ్యంగా 40 సంవత్సరాలు పైబడిన వారు ప్రివెంటివ్‌ పద్ధతులు పాటిస్తూ ప్రతీ 6 నెలలకోసారి రక్తపరీక్ష చేయించుకుంటూ, కొద్ది గా తేడా కనిపించినా, మందుల అవసరం లేకుండానే తగ్గించుకోవడం మంచిది.

* బిల్వపత్రం, నేరేడు ఫలాలు, కాకర విత్తనాలు, పొడపత్రి, కరక్కాయ, తిప్పతీగె, ఉసిరి, అశ్వగంధ సమానభాగాల్లో తీసుకొని పొడి చేసి భద్రపర్చుకోవాలి. రోజూ పొద్దున, సాయం త్రం ఒక టీ స్పూన్‌ చొప్పున తీసుకుంటే చక్కెర వ్యాధిని నియంత్రించుకోవడం, తగ్గించు కోవడం తేలికే.
* వేదకాలంలో మధుమేహ ప్రస్తావన ఉంది.ఆ కాలంలో మధుమేహాన్ని అశ్రవ అనే పేరు తో గుర్తించారు.ఈ వ్యాధి ఎలా వస్తుంది వ్యాధి లక్షణాలు ఏమిటి అని చరక సంహిత, శుశ్ర వసంహిత, నాగభట్ట గ్రంథాలలో వివరించారు. క్రీస్తుశకానికి వెయ్యి సంవత్సరాల కిందటనే ఈ వ్యాధి వర్ణన ఉండడం విశేషం. యజ్ఞ సమయాలలో దేవతలకు సమర్పించే హవిస్సును భుజించడం వలన ఈవ్యాధి వచ్చినట్లు పేర్కొన్నారు.

దక్షప్రజాపతి చేసిన యజ్ఞంలో హవిస్సు భుజించడం వలన ఈ వ్యాధి వచ్చినట్లు ప్రస్తావన ఉంది.క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలో అష్టాంగ హృదయ అనే గ్రంధంలో మధుమేహం అనే పదం వాడబడింది. తేనెను మధువు అని అంటారు కనుక ఈ వ్యాధిగ్రస్థుల మూత్రం తేనెరంగు ఉంటుందని దీనికి ఈ పేరు వచ్చిందని భావన.1400 సంవత్సరాల క్రితమే ఈ వ్యాధిని పత్యం,ఔషధం,వ్యాయామంతో క్రమపరచవచ్చని పేర్కొన్నారు. దాదాపు ఇప్పటికీ అనుసరిస్తున్న విధానం అదే కావడం గమనార్హం.

ఆయుర్వేదంలో గుర్తించిన వ్యాధి కారక అలవాట్లు
mahesh- అతిగా పాలుతాగడం. పాల ఉత్పత్తులు భుజించడం.
- అతిగా చక్కెర ఉపయోగించడం. చక్కెర రసాలు తాగడం.
- కొత్తగా పండిన ధాన్యాలను వంటలలో వాడడం.
- తాజాగా చేసిన సురను (మధువును) సేవించడం.
- అతిగా నిద్ర పోవడం, శరీరశ్రమ కావలసినంత చేయకపోవడం.
- మానసిక ఆందోళన, భారీ కాయం, అహారపు అలవాట్లు.
- ముందుగా తిన్నది జీర్ణంకాకముందే తిరిగి భుజించడం.
- ఆకలి లేకున్నా ఆహారం తీసుకోవడం.
- అతిగా ఆహారం తీసుకోవడం.

డాక్టర్‌ బుక్కా మహేశ్‌ బాబు
ఆయుర్వేద వైద్యులు
హైదరాబాద్‌, సెల్‌: 98853 06096


హోమియో చికిత్స
diabetesff 
హోమియోపతి వైద్యవిధానంతో చక్కెర వ్యా ధిని నియంత్రించవచ్చు. రోగ లక్షణాలతో పాటు రోగి ప్రత్యేక లక్షణాలను పరిగణన లోకి తీసుకొని హోమియోవైద్యులు మందు లు ఇస్తారు. ఈ మందులు వాడడంతో పా టు సాధారణంగా చక్కెర వ్యాధి నియంత్రణకు సూచించిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. హోమియోపతి వైద్య విధానం సారూప్య పద్ధతి ఆధారంగా రూపుదిద్దుకున్నది. ఈ వై ద్యాన్ని జర్మన్‌ శాస్తవ్రేత్త శామ్యూల్‌ హానిమ న్‌ 1796లో కనిపెట్టారు. ఈ విధానంలో వ్యాధి ఆధారంగా గాకుండా వ్యక్తి లక్షణా లను పరిగణనలోకి తీసుకొని మందు నిర్ధా రిస్తారు. కొన్ని సాధారణ హోమియోపతి మందులను కింద సూచించినా డాక్టర్‌ను సంప్రదించడం తప్పనిసరి.

1. సైజిజీయం జంబోలినమ్‌
- అధిక దాహం, నీరసం
- అధిక మూత్రం
- సాధారణ ఆహారం తీసుకున్నా కూడా శరీరం చిక్కిపోవడం

2. అబ్రోమా అగస్టా
- ఉదయం, రాత్రి వేళలో అధిక మూత్రం
- గొంతు ఎండిపోవడం, అధిక దాహం
- మూత్రవిసర్జన అయిన వెంటనే దాహం కలగడం
- మూత్ర విసర్జన ఆపుకోలేకపోవడం

3. సెఫలాండ్ర ఇండికా
- భయం, పనిమీద ఆసక్తి లేకపోవడం, సున్నితమైన మనస్తత్వం
- నీరసం, మూత్ర విసర్జన అయిన తరువాత కళ్ళు తిరగడం
- అధిక దాహం, అధిక మూత్రం
- శరీరమంతా మంటగా ఉండడం
manikh 
4. జిమ్నీమా సిల్విస్ట్రా
- లైంగిక సంబంధ సమస్యలు
5. పాస్ఫారిక్‌ యాసిడ్‌
- నీరసం, ఉత్సాహం లేకపోవడం, నిర్లక్ష్యంగా ఉండడం
- నడిచినా లేదా నిలబడినా కళ్ళు తిరగడం
- రాత్రివేళ అధికంగా మూత్రవిసర్జనకు వెళ్ళడం
- మూత్ర విసర్జనకు ముందు ఆతృత, తరువాత మంటగా ఉండడం
- రాత్రిపూట కాళ్ళనొప్పులు అధికమవడం
- ఉదయం, రాత్రి వేళలో అధికంగా చెమట పట్టడం.

కళ్ళు- జాగ్రత్తలు
eyes 
మధుమేహవ్యాధి లక్షణాలు బయటపడక ముందే చాలా సందర్భాల్లో కళ్ళు దెబ్బతినడం గానీ, రోగగ్రస్తం కావడం కానీ జరుగు తుంది. కంటికి సంబంధించి ఏ బాధ కలిగి నా వెంటనే కంటిడాక్టర్‌ను సంప్రదించాలి. సంవత్సరానికి కనీసం రెండు సార్లు కంటి  పరీక్ష చేయించు కోవాలి.  మధుమేహం ఉన్నవారిలో సాధారణ కంటి  వ్యాధులు: శుక్లాలు, గ్లకోమా (ద్రవాల పీడనం పెరగడం), రెటినోపతి (కంటి లోని నరాలు దెబ్బ తినడం).

Tuesday, August 30, 2011

చక్కెరకు కోత * శస్త్రచికిత్సతోనూ డయాబెటిస్ సమస్యను పరిష్కరించేందుకు అవకాశం

రక్తంలో చక్కెర పాళ్లను పెంచే ‘డయాబెటిస్’ ఎన్నో అవస్థలకు కారణం. దాన్ని నియంత్రణలో ఉంచుకోకపోవడం వల్ల మరెన్నో ప్రాణాంతక పరిస్థితులు రావచ్చు. ఇప్పటివరకూ మందులు, ఇన్సులిన్ వంటి ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే కొందరి విషయంలో శస్త్రచికిత్సతోనూ డయాబెటిస్ సమస్యను పరిష్కరించేందుకు అవకాశం ఉంది. దాంతో దీర్ఘకాలికంగా మందులు తీసుకోవడాన్ని చాలా కేసుల్లో నివారించవచ్చు. డయాబెటిస్ సమస్యలకు క్రమంగా ఆదరణ పొందుతున్న సర్జికల్ ప్రక్రియలపై అవగాహన కల్పించేదే ఈ కథనం.

ఏదైనా తినగానే రక్తంలోకి చక్కెర గ్లూకోజ్ రూపంలో శక్తి విడుదల అవుతుంది. అందుకే డయాబెటిస్‌ను పరగడపున నిర్వహించే రక్త పరీక్షల్లోని చక్కెరపాళ్లను బట్టి నిర్ణయిస్తారు. పరగడుపున చేసే పరీక్షలో (ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ స్థాయులు) 105 కంటే ఎక్కువగా ఉంటే చక్కెరను నియంత్రించడానికి మందులు వాడాల్సి ఉంటుంది. ఎందుకంటేనియంత్రణ లేకుండా రక్తంలో చక్కెర పెరగడం వల్ల సూక్ష్మ రక్తనాళికలు దెబ్బతినడం ద్వారా కిడ్నీ సమస్యలు మొదలుకొని ఎన్నో కాంప్లికేషన్స్‌కు దారితీయవచ్చు. పక్షవాతం, రక్తపోటు వంటి జబ్బులు మొదలుకొని గ్యాస్ట్రోపతి, అంగస్తంభన సరిగా లేకపోవడం వంటి సమస్యలు రావచ్చు.

స్థూలకాయంతో డయాబెటిస్ ఎందుకు...?

డయాబెటిస్‌కు దారితీసే సమస్యల్లో అత్యంత ప్రధానమైనది స్థూలకాయం (ఒబేసిటీ). ఒక పరిశీలన ప్రకారం... డయాబెటిస్ (టైప్-2) ఉన్నవాళ్లలో 90 శాతం మంది స్థూలకాయం కలిగి ఉంటారు. మన భారతీయుల్లో పొట్ట దగ్గర కొవ్వు పెరగడం కూడా డయాబెటిస్‌కు దారితీసేందుకు కారణాల్లో ఒకటి. ఒళ్లు పెరుగుతున్న కొద్దీ ఆ పెరుగుదలకు అనుగుణంగా శరీరమంతటా చక్కెర గ్లూకోజ్‌ని నియంత్రించాల్సిన బాధ్యత ప్యాంక్రియాస్ గ్రంథిది. అయితే ఆ పెరిగిన బరువు మేరకు అక్కడ కూడా గ్లూకోజ్‌ను నియంత్రించేందుకు అవసరమైనంత ఇన్సులిన్‌ను ప్యాంక్రియాస్ ఉత్పత్తి చేయలేకపోవడంతో డయాబెటిస్ వస్తుంది.

ఇప్పుడు ఉన్న చికిత్స...

రక్తంలో చక్కెర పాళ్లను నోటి ద్వారా మందులు ఇవ్వడం లేదా ఇంజెక్షన్ ద్వారా ఇన్సులిన్ ఇవ్వడం ఇప్పుడు సంప్రదాయికంగా జరుగుతున్న ప్రక్రియ. దీనికి తోడు రక్తంలో చక్కెరను పెంచే ఆహారాన్ని నివారించడం కూడా మామూలే. అయితే ఒకసారి డయాబెటిస్ కనిపిస్తే దానికి ఇలా నియంత్రణ మార్గాల తప్ప పూర్తిగా డయాబెటిస్ లేకుండా చేయడం సాధ్యం కాదు.

అసలు లేకుండా చేయవచ్చా... ?

మాటిమాటికీ మందులు తీసుకోకుండా ఏవైనా శస్త్రచికిత్స మార్గాల ద్వారా అసలు డయాబెటిస్‌ను పూర్తిగా లేకుండా చేయవచ్చా?... రోగులు అడిగే ప్రశ్నకు సమాధానం కోసం పరిశోధన రంగంలో గత మూడు దశాబ్దాల నుంచి కొంత కృషి జరుగుతోంది. బరువును తగ్గించే శస్త్రచికిత్స చేయడం ద్వారా డయాబెటిస్‌ను రాకుండా చేయవచ్చా అని డాక్టర్లు పరిశీలిస్తున్నారు. ఇందుకు బేరియాట్రిక్ శస్త్రచికిత్సను ఒక సాధనంగా చెబుతున్నారు. ఇలా శస్త్రచికిత్స చేసి బరువు నియంత్రించిన సందర్భాల్లో దాదాపు 70 శాతం కేసుల్లో డయాబెటిస్‌ను పూర్తిగా అరికట్టగలిగారు. ఇక మరో 20 శాతం కేసుల్లో తీసుకోవాల్సిన మందుల మోతాదును గణనీయంగా తగ్గించగలిగారు.

శస్త్రచికిత్స ప్రొసిజర్లు :

స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ: ఇది లాపరోస్కోపిక్ ప్రక్రియ ద్వారా (అంటే తక్కువ గాటుతో) నిపుణులు చేసే అతి సాధారణ శస్త్రచికిత్స. ఇందులో ఆహారకోశాన్ని 70 శాతం మేరకు తీసివేస్తారు. దాంతో తీసుకునే ఆహారం పరిమాణం గణనీయంగా తగ్గిపోతుంది.

గ్యాస్ట్రిక్ బైపాస్:
సాధారణంగానైతే... మనం తీసుకునే ఆహారం అన్నవాహిక నుంచి అన్నకోశానికి వెళ్తుంది. కానీ... ఈ ప్రక్రియలో అన్నవాహికలోకి కాకుండా పేగుల్లోకే వెళ్లేలా బైపాస్ చేస్తారు.

స్లీవ్ విత్ ఇలియల్ ఇంజర్‌పొజిషన్:
ఇందులో స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ చేయడంతో పాటు చిన్న పేగుల ప్రారంభభాగమైన ఇలియమ్‌నూ ఆహారం బైపాస్ చేసేలా సర్జరీ చేస్తారు. అయితే ప్రస్తుతం ఈ శస్త్రచికిత్స ప్రయోగదశలోనే ఉంది.

శస్త్రచికిత్సలతో ప్రయోజనం ఎలా...

కొన్ని డయాబెటిస్ శస్త్రచికిత్సల ద్వారా రక్తంలో చక్కెరపాళ్లు పెరగకుండా ఉండే విషయాన్ని డాక్టర్లు పరిశీలించారు. సాంప్రదాయికంగా ఇచ్చే మందులతో రక్తంలో చక్కెరపాళ్లను నియంత్రించడానికి ప్రత్యామ్నాయంగా శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ‘ఫోర్‌గట్ థియరీ’ అనే ఒక శస్త్రచికిత్స పద్ధతితోనూ, ‘హైండ్ గట్ థియరీ’ అనే మరో తరహా పద్ధతితోనూ డయాబెటిస్‌ను పూర్తికాలం రాకుండా చేయవచ్చని బేరియాటిక్ సర్జన్స్ పేర్కొంటున్నారు.

‘ఫోర్‌గట్ థియరీ’ పద్ధతి ద్వారా సాధించే ప్రయోజనాలు

మనం తీసుకున్న ఆహారం ఆహారకోశంలో చేరి అక్కడ కాసేపు ఉంటుంది. దాన్ని అక్కడ నిలవకుండా చేయడానికి ఆహారకోశం పై భాగాన్ని (ఫోర్ గట్‌ను) శస్త్రచికిత్సతో తగ్గిస్తారు. దాంతో కడుపులో ఎక్కువ ఆహారం పోగుకావడం తగ్గి రక్తంలోకి విడుదల అయ్యే చక్కెర కూడా తగ్గుతుంది.

బరువు ఎక్కువగా ఉన్నవారిలో ఆ బరువుకు తగినంత ఇన్సులిన్ దొరకక పోవచ్చు. శస్త్రచికిత్స ద్వారా తీయాల్సినంత తీసి, ఇన్సులిన్ సరిపోయేలా చూడవచ్చు.


ఆకలికి కారణమైన ‘ఘ్రెలిన్’ అనే హార్మోన్‌పాళ్లను తగ్గించి, ఆకలిని సాధ్యమైనంత తగ్గించడం.


ఈ శస్త్రచికిత్స వల్ల ఆహారం వెంటనే చిన్న పేగుల్లోని ఇలియమ్‌లోకి వెళ్తుంది. ఫలితంగా అక్కడ జీఎల్‌పీ (గ్లూకగాన్ లైక్ పెప్టైడ్) అనే హార్మోన్ స్రావం పెరుగుతుంది. అది చక్కెరనియంత్రణలోఇన్సులిన్‌లా దోహదపడుతుంది.


‘హైండ్‌గట్ థియరీ’ పద్ధతి ద్వారా సాధించే ప్రయోజనాలు

ఈ మార్గంలో కడుపులోని కింది భాగం (హైండ్ గట్)ను తగ్గిస్తారు. దాంతో కడుపు త్వరగా ఖాళీ కావడం అనే ప్రక్రియ తగ్గుతుంది. ఈ పద్ధతిలో ఈ కింది ప్రయోజనాలు సాధిస్తారు.

ఈ శస్త్రచికిత్సలోనూ ఆహారాన్ని ఆహారకోశం నుంచి చిన్నపేగుల ప్రవేశమార్గమైన ఇలియమ్‌లోకి వెంటనే వెళ్లేలా చేస్తారు.


ఫలితంగా జీఎల్‌పీ (గ్లూకగాన్ లైక్ పెప్టైడ్) అనే హార్మోన్ ఎక్కువగా స్రవించేలా చూస్తా రు. దాంతో చక్కెర పాళ్లు పెంచే గ్జైకోజెన్ ఉత్పత్తి తగ్గుతుంది. చక్కెరపాళ్లు తగ్గించే హార్మోన్ ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది.


మరికొన్ని అంశాలు :

దాదాపు 60 శాతం నుంచి 80 శాతం కేసుల్లో మంచి ప్రయోజనాలు.

చాలామందిలో ఇన్సులిన్ తీసుకోవడం దాదాపు ఆపివేయడం లేదా మోతాదును గణనీయంగా తగ్గించడం చేయవచ్చు.


డయాబెటిస్ వచ్చేందుకు ఆస్కారం ఉన్న చాలామందిలో శస్త్రచికిత్సతో డయాబెటిస్‌ను నివారించేందు ఆస్కారం ఎక్కువ.


శస్త్రచికిత్సల వల్ల అర్లీ డయాబెటిస్‌తో వచ్చే నెఫ్రోపతి, రెటినా వ్యాధులు, గుండె కండరానికి వచ్చే ముప్పు, ఫాటీ లివర్, అర్లీ సిర్రోసిస్ వంటి సమస్యలను నివారించవచ్చు.


సర్జరీ సత్ఫలితాలు ఇస్తే... దీర్ఘకాలం మందులు వాడాల్సిన అవసరం రాకుండా శస్త్రచికిత్సతోనే పరిస్థితి చక్కబడుతుంది.

Monday, August 22, 2011

డయాబెటిస్‌తో సమస్యలెన్నో...

డయాబెటిస్‌ అనేది వ్యాధి కాదు డైజెస్టివ్‌ డిజార్డర్‌. మనం తీసుకునే ఆహారం జీర్ణమై షుగర్‌గా మారి రక్తంలో కలిసి వివిధ శరీర భాగాలకు చేరుతుంది. అలా దేహంలో కణాలు అన్నింటికీ ఆహారం అందుతుంటుంది. ఒక్కొక్కసారి అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు రక్తం నిండా గ్లూకోజ్‌ నిండిపోతుంటుంది. కణాలు ఆహారం లేక ఇబ్బందిపడుతుంటాయి. కణాలు రక్తంలోంచి గ్లూకోజ్‌ను తీసుకోకపోవడం వల్ల రక్తంలో సుగర్‌ స్థాయి పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితిని ‘హైపర్‌ గ్లైసీమియా’ లేక మధుమేహం అంటారు.

Diabetic 

డయాబెటిస్‌ రెండు రకాలు 1. టైప్‌-1 డయాబెటిస్‌ 2. టైప్‌ -2 డయాబెటిస్‌.. దీనిని ‘డయాబెటిస్‌ మెల్లిటస్‌’ అంటారు. మన శరీరంలో ఉత్పత్తి అవుతున్న హార్మోన్స్‌ ప్రత్యేక విధుల్ని నిర్వహిస్తాయి. ఇన్సులిన్‌ అనే హార్మోన్‌ రక్తంలోని షుగర్‌ కణాల్లోకి వెళ్ళేట్టు చేస్తుంది. సరిపడిన ఇన్సులిన్‌ శరీరంలో లేకపోతే ఉత్పత్తయిన ఇన్సులిన్‌కి శరీరం స్పందించకపోయినా రక్తంలోని షుగర్‌ పెరుగుతుంది. డయాబెటిస్‌ అంటే ఇదే!టైప్‌ -1 డయాబెటిస్‌లో శరీరంలో చాలా తక్కువగా ఇన్సులిన్‌ ఉత్పత్తి అవుతాయి. లేకపోతే అసలు ఉత్పత్తి కాదు. టైప్‌-2 డయాబెటిస్‌ అయితే శరీర కణాలు ఇన్సులిన్‌కు స్పందించవు. శరీరంలో కావలసినంత ఇన్సులిన్‌ ఉత్పత్తి కాదు. లేకపోతే రెండూ జరుగవచ్చు.

టైప్‌ -2 డయాబెటిస్‌లో మూత్రం ఎక్కువగా అవుతుంది. దాహం ఎక్కువ. దీనివల్ల ఇబ్బంది కలగకపోయినా భవిష్యత్తులో హార్ట్‌ ఎటాక్‌ రావచ్చు. మూత్ర పిండాల జబ్బులు రావచ్చు, దృష్టి సమస్యలు సంభవించవచ్చు, కాళ్ళు చేతుల్లోంచి నరాలు సరిగ్గా పనిచేయక తిమ్మిర్లు కలుగవచ్చు. ఇది నరాల ఇబ్బంది వల్ల కలుగుతుంది. దీనిని ‘న్యూరోపతి’ అంటారు. రక్తనాళంలో ఇబ్బంది రావచ్చు. దీనిని వాస్యులోపతి అంటారు. సాధారణంగా కాలి వేళ్ళ ప్రాంతంలో ఇది ప్రారంభమవుతుంది. బొటనవేలుకి రక్తప్రసరణ ఆగినప్పుడు అది కుళ్ళిపోవచ్చు. పాదం అంతా వ్యాపించవచ్చు. క్రమంగా మోకాళ్ళ వరకూ... ఆ క్రమం లో తుంటివరకు వ్యాపించవచ్చు. గాంగ్రిన్‌ వచ్చి కుళ్లిపోయిన అవయవాన్ని ‘యాంపుటేషన్‌’ ద్వారా శరీరం నుంచి వేరు చేయాల్సి వస్తుంది.

చిన్న రక్తపరీక్ష ద్వారా రక్తంలో షుగర్‌ స్థాయిని తెలుసుకోవచ్చు. పొద్దున్నే ఏ ఆహారం తీసుకోకుండా రక్తపరీక్షలు జరిపితే ‘ఫాస్టింగ్‌ బ్లడ్‌ షుగర్‌’ అంటారు. ఆ తరువాత ఏమైనా తిని గంటన్నరకి రక్త పరీక్షలు జరిపితే ‘పోస్ట్‌ లంచ్‌’ అంటారు. రోజులో ఏదో ఒక సమయంలో చేసే రక్త పరీక్షను ‘రాండమ్‌’ రక్తపరీక్ష అని అంటారు. హెచ్‌బి, ఎ, సి రక్తపరీక్ష ద్వారా గత మూడు నెలల్లో బ్లడ్‌ షుగర్‌ ఎలా ఉందో తెలుస్తుంది. డయాబెటిస్‌ని తగ్గించడానికి కొన్ని మందులున్నాయి. అవసరమైతే ఇంజక్షన్‌ ద్వారా ‘ఇన్సులిన్‌’ని ఇవ్వడం ప్రారంభిస్తారు. ఇది పరీక్షించిన వైద్యుడు నిర్దేశిస్తాడు. ఒక్కొక్కసారి డయాబెటిస్‌ వల్ల మరిన్ని ఆరోగ్య ఇబ్బందులూ కలుగకుండా మందులు వాడాల్సి ఉంటుంది.

diabetes-supplyఉదాహరణకి రక్తపోటు తగ్గించగలిగే మందుల ద్వారా హార్ట్‌ ఎటాక్‌ లేదా స్ట్రోక్‌ రాకుండా కాపాడుకోవచ్చు. మందులతో పాటు జీవన విధానాన్ని కొద్దిగా మార్చుకోవాలి. కదలికలు లేకుండా ఉండకూడదు. యాక్టివ్‌గా ఉండాలి. బరువు తగ్గాలి. కొవ్వును పెంచే పదార్ధాలు తగ్గిం చాలి. ఇలాంటి అలవాట్లు డయాబెటిస్‌ అదుపులో ఉంచడానికి తోడ్పడతాయి. డయాబెటిస్‌ ఉన్న వాళ్ళు ‘ఎ,బి,సి’ కంట్రోల్‌ చేసుకోవాలి. ఎ అంటే ఎ,సి రక్త పరీక్ష. గత మూడు నెలలుగా బ్లడ్‌ షుగర్‌ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. బి అంటే బ్లడ్‌ ప్రెజర్‌. దీనిని అదుపులో ఉంచుకోవాలి. రక్తపోటు ఎక్కువగా ఉంటే హార్ట్‌ ఎటాక్‌, స్ట్రోక్‌, మూత్రపిండాల జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ. అంటే రక్తంలో కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాలి. కొలెస్ట్రాల్‌ ఎక్కువయితే హార్ట్‌ ఎటాక్‌, స్ట్రోక్‌ ఇతర జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ.

డయాబెటిస్‌ లేని వాళ్ళకన్నా డయాబెటిస్‌ ఉన్నవాళ్ళకి గుండెపోటు వచ్చే అవకాశాలు రెండు లేక మూడు రెట్లు ఎక్కువ. డయాబెటిస్‌ ఉన్నవాళ్ళకి చిన్న వయసులోనే గుండెపోటు రావచ్చు. అది తీవ్రంగా రావచ్చు. డయాబెటిస్‌ ఉన్నవాళ్ళలో జాగ్రత్తలు పాటించకపోతే మూత్రపిండాల వ్యాధులు త్వరగా రావచ్చు. ఈ రిస్క్‌ నుంచి కాపాడుకోవాలంటే ‘ఎ,బి,సి’లను అదుపులో ఉంచుకోవాలి తప్పదు. ఎ,సి స్థాయి ఏడుకన్నా తక్కువ ఉండాలి. రక్తపోటు 140/90 దాటరాదు. ఎల్‌.డి.ఎల్‌. కొలెస్ట్రాల్‌.. బాడ్‌ కొలెస్ట్రాల్‌ 100 కన్నా తక్కువ ఉండాలి.

తాజా పళ్ళు, కూరగాయలు, పప్పు దినుసులు, కొవ్వులేని పదార్ధాలు తినాలి. ప్రతి రోజూ వ్యాయామం తప్పనిసరి. కనీసం అరగంటైనా నడవాలి. ధూమపానాన్ని పూర్తిగా మానేయాలి. ఆల్కహాల్‌కి దూరంగా ఉండాలి. ఈ విధంగా మన జీవన విధానాన్ని మార్చుకున్నప్పుడే డయాబెటిస్‌ను అదుపులో ఉంచగలం. డయాబెటిస్‌ అదుపులో ఉంటే అంత ఇబ్బంది ఉండదు.


డా ఎమ్‌.ఎ. వాహబ్‌ జుబేర్‌
డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మెడిసిన్‌
ఆలివ్‌ హాస్పిటల్‌
మెహదీపట్నం, హైదరాబాద్‌
ఫోన్‌: 8142961443

Tuesday, July 12, 2011

ఇన్సులిన్ అంటే భయమెందుకు?

http://www.healthspablog.org/wp-content/uploads/2009/04/diabetes1.jpg
ఒకసారి ఇన్సులిన్ తీసుకోవడం మొదలయ్యిందీ అంటే ఇక జీవితాంతం కొనసాగించవలసిందేనన్న భావన చాలా మందిలో ఉంది. ఇన్సులిన్ తీసుకోవడం అంటే పరిస్థితి బాగా విషమించిందని కూడా కాదు. కొన్నిసార్లు మాత్రలకు శరీరం స్పందించకపోవచ్చు. అలాంటప్పుడు ఇన్సులిన్ ఇస్తారు. ఇన్సులిన్ తాలూకు జనంలో పాతుకుపోయిన కొన్ని అపోహల గురించి, వాస్తవాల గురించి ప్రముఖ ఛాతీ వైద్య నిపుణులు డాక్టర్ ఎస్. వి. ప్రసాద్ అందిస్తున్న కొన్ని వివరాలు మీకోసం...http://www.elements4health.com/images/stories/conditions/diabetes-symptoms.jpg
శరీరంలోని అతి ప్రధానమైన హార్మోన్ ఇన్సులిన్. క్లోమగ్రంధి (పాంక్రియాస్)లో ఉత్పన్నమయ్యే ఇన్సులిన్ గ్లూకోజ్‌ను అనుక్షణం నియంత్రణలో ఉంచే పనిలో ఉంటుంది. అయితే కొందరిలో ఇన్సులిన్ తన విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోవచ్చు. ఈ స్థితినే మధుమేహం అంటాం. మధుమేహ నియంత్రణలో క్లోమగ్రంధిలోని ఇన్సులిన్ ఉత్పత్తి శక్తిని పెంచేందుకు మాత్రలు సూచిస్తారు. కొద్ది మందిలో ఈ వ్యాధి జీవిత కాలమంతా మాత్రలతోనే నియంత్రణలోనే ఉంటుంది. కానీ, చాలా మందిలో కొంతకాలానికి ఈ మాత్రలు అంత శక్తివంతంగా పనిచేయకుండాపోతాయి. ఈ స్థితి కొంత మందిలో 10 ఏళ్లకే ఏర్పడితే మరికొంత మందిలో 20 ఏళ్లు పట్టవచ్చు. కారణమేదైనా మాత్రలు పనిచేయకుండా పోయినప్పుడు ఇన్సులిన్‌ను ఆశ్రయించక తప్పదు. అయితే ఒకసారి ఇన్సులిన్ తీసుకుంటే దాన్ని ఎప్పటికీ కొనసాగించాలనేమీ కాదు.

ఎన్నెన్ని అపోహలో..

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEinrQEXASGCuAkuwnVk4-dRHS-cON9VUowE43ePaS5PiiOBja3cCxZVr3ptXviCsW_hy84Ly0fO2q7kAQveuZ4h5316GT8va4Jwd1cV8OLAH_2J1F_0eZvXKADUEEmy95ONs7DIvzh3YqY/s1600/insulin.jpg
వాస్తవానికి మాత్రలైనా, ఇన్సులిన్ అయినా శరీరాన్ని ఒకే స్థాయిలో ప్రభావితం చేస్తాయి. ఇన్సులిన్ తీసుకోవడం వల్ల అదనంగా నష్టపోయేదేమీ లేదు. ఎప్పుడైనా డాక్టర్ ఇన్సులిన్ తీసుకోవాలని చెప్పినప్పుడు చాలా మంది మొరాయిస్తారు. డాక్టర్ మాటను పక్కన పెట్టి మాత్రలతోనే సరిపెడతారు. ఇలా చేజేతులా ఆరోగ్యాన్ని మరింత పాడు చేసుకుంటారు. ఇన్సులిన్‌ను బయటి నుంచి ఇస్తాం. మాత్రలైనా ఇన్సులిన్‌నే తయారుచేస్తాయి. ఒకసారి ఇన్సులిన్ తీసుకుంటే శరీరం ఇన్సులిన్‌కు అలవాటుపడిపోతుందన్నది కేవలం అపోహ. రోజూ మాత్రలు వేసుకునే వారికి అత్యవసర పరిస్థితుల్లో కొన్ని సార్లు ఇన్సులిన్ ఇస్తాం.http://www.sciencemuseum.org.uk/WhoAmI/FindOutMore/Yourgenes/Howdogenesaffectyourhealth/Whatcausesdisease/~/media/WhoAmI/FindOutMore/S/Somepeoplewithdiabetesneedinsulininjections1-3-3-4-7-0-0-0-0-0-0.jpg
గ్లూకోజ్ నియంత్రణలోకి రాగానే మళ్లీ మాత్రలనే కొనసాగించమని చెబుతాం. మాత్రలు ఇక ఏమాత్రం పనిచేయక ఇన్సులిన్ దశకు చేరుకున్న వారి పరిస్థితి వేరు. వారింక రోజూ ఇన్సులిన్ తీసుకోవలసిందే. ఇన్సులిన్ తీసుకోవడం వల్ల శరీరంలో షుగర్ బాగా తగ్గిపోతుందనేది (లో-షుగర్) మరో అపోహ. డోసు అవసరానికి మించితే మాత్రలతోనూ షుగర్ తగ్గిపోతుంది. నిజానికి మాత్రల ద్వారా జరిగే తగ్గుదలే ఇన్సులిన్ కన్నా ఎక్కువ ప్రమాదకరమైది. ఇన్సులిన్‌తో తగ్గితే ఆ ప్రభావం 12 గంటలే ఉంటుంది. అదే మాత్రల ద్వారా తగ్గితే 36 నుంచి 48 గంటల దాకా ఉంటుంది. మాత్రలతో అతిగా తగ్గిపోవడం ఒక్కోసారి ప్రమాదకరంగా మారవచ్చు. శరీరంలో ఇన్సులిన్ అసలే ఉత్పత్తి కాని టైప్-1 మధుమేహం ఉన్న వారికి మాత్రం రోజూ ఇన్సులిన్ ఇవ్వడం తప్పదు. మిగతా అందరికీ ఆ అవసరం ఉండదు. మధుమేహం మొదలైన వారికి చాలా వరకు మాత్రలే సరిపోతాయి.

కాకపోతే, కొన్నిసార్లు గ్లూకోజ్ నియంత్రణ తప్పి కొందరికి కాళ్లల్లో పుండ్లు ఏర్పడవచ్చు. ఆ పుండు మానేవరకు కొంత కాలం ఇన్సులిన్ తీసుకోవలసి రావచ్చు. ఆ సమస్య తగ్గిపోతే మళ్లీ మాత్రల్లోకి మారిపోవచ్చు. అలాగే కొన్ని రకాల జబ్బులు ముఖ్యంగా క్షయ లాంటి వ్యాధి సోకినప్పుడు ఆ వ్యాధికి సంబంధించినవే దాదాపు 10 మాత్రల దాకా వేసుకోవలసి రావచ్చు. అలాంటి సమయాల్లో షుగర్ మాత్రలు కూడా వేసుకుంటే ఏ మందులూ పనిచేయకపోవచ్చు. అలాంటి సమయాల్లో మాత్రలకు బదులుగా ఇన్సులిన్ తీసుకోవలసి ఉంటుంది. మధుమేహం కారణంగా రోజూ మాత్రలు వేసుకునే వారికి శస్త్ర చికిత్స అవసరమైనప్పుడు ఇన్సులిన్ తప్పనిసరి అవుతుంది. ఇన్సులిన్ ఇస్తే మూడు నుంచి 6 గంటల్లోనే దాని ప్రభావం ఆగిపోతుంది.

అదే మాత్రలతో అయితే దాని ప్రభావం 36 గంటల దాకా కొనసాగుతూనే ఉంటుంది. ఇలా ఎక్కువ గంటల ప్రభావం ఉన్నప్పుడు గ్లూకోజ్ బాగా తగ్గి కొన్ని సార్లు ప్రమాద స్థితిని చేరుకోవచ్చు. అందుకే శస్త్ర చికిత్సల సమయంలో ఇన్సులిన్ ఇస్తారు. శస్త్ర చికిత్స పూర్తయిన రెండు మూడు రోజుల తరువాత మళ్లీ మాత్రల్లోకి మారిపోవచ్చు. మధుమేహానికి పదేళ్లుగా మాత్రలు వేసుకుంటున్న వారిలో ముఖ్యంగా స్థూలకాయులు, వృద్ధుల్లో కొంత కాలానికి మాత్రలు పనిచేయకుండా పోవచ్చు. అలాంటి వారు ఇక ఇన్సులిన్‌ను ఆశ్రయించక తప్పదు. కొందరిలో మాత్రలు బాగానే పనిచేస్తున్నా, మాత్రల తాలూకు కొన్ని దుష్ప్రభావాలు మొదలవుతాయి. వాటిలో కంటిచూపు తగ్గడం, కి డ్నీలు దెబ్బతినడం, కొన్ని నరాల జబ్బులు (పెరిఫెరల్ న్యూరోపతి), గుండె జబ్బుల్లాంటి సమస్యలు తలెత్తవచ్చు. ఈ స్థితిలో కూడా మాత్రలనుంచి ఇన్సులిన్‌కు మారవలసి ఉంటుంది.

కృత్రిమ ఇన్సులిన్

చాలా కాలం దాకా జంతువుల నుంచి తీసిన ఇన్సులిన్‌నే మనుషులకు ఇచ్చేవారు. అందులో జంతు సంబంధించిన ప్రొటీన్లు కూడా ఉండడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉంటూ వచ్చాయి. ఈ కారణంగా కృత్రిమ ఇన్సులిన్ తయారీ మొదలయ్యింది. ఇది ఇప్పుడు అందుబాటులోనే ఉంది. రికాంబినెంట్ డిఎన్ఎ సింథటిక్ ఇన్సులిన్ లేదా మోనో కాంపోనెంట్ ఇన్సులిన్ అనే ఈ ఇన్సులిన్ పూర్తి పరిశుద్ధంగా ఉంటోంది. దీనివల్ల మునుపటి ఆ దుష్ప్రభావాలు కూడా లేకుండా పోయాయి. కొందరికి ఎక్కువ మొత్తంలో అంటే రోజుకు దాదాపు 120 యూనిట్ల దాకా ఇన్సులిన్ అవసరమవుతుంది.

అలాంటి వారికి మాత్రలు సరిపోవు. తప్పనిసరిగా ఇన్సులిన్ తీసుకోవాలి. కాకపోతే ఎక్కువ మంది ఇన్సులిన్ అంటే భయపడేది రోజూ ఇంజెక్షన్ తీసుకోవలసి వస్తుందని, ఆ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల నొప్పి కలుగుతుందని. ఇప్పుడా సమస్య కూడా లేదు. 26 నంబర్ నీడిల్ అనే ఇంజెక్షన్ సూది అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. దీనివల్ల అసలు నొప్పే తెలియదు. ఇన్సులిన్ తీసుకోవడం అనేది జీవితపు చిట్టచివరి దశగా భావించడం మరో అపోహ. నిజానికి ఇన్సులిన్ తీసుకోవడం అన్నది ఏ దశలోనైనా ప్రారంభం కావచ్చు. మందులు బాగా పనిచేయనప్పుడు ఇస్సులిన్ సూచిస్తాం. కొన్ని దశాబ్ధాలుగా ఇన్సులిన్ తీసుకుంటూ ఆరోగ్యంగా ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు. అలాంటప్పుడు ఇన్సులిన్ తీసుకోవడం చివరి దశ ఎలా అవుతుంది? మాత్రలైనా ఇన్సులిన్ అయినా శరీర ధర్మాన్ని అనుసరించి, శరీర అవసరాన్ని బట్టే ఉంటుంది . అంతే తప్ప అవి సమస్య తీవ్రతను చెప్పేవి కావు. అవసరం ఉన్నప్పుడు ఇన్సులిన్ తీసుకోవడం వివేకం అవుతుందే తప్ప మరొకటి కాదు.

ఇన్సులిన్ పంప్స్

http://www.typefreediabetes.com/v/vspfiles/templates/TypeFree/images/images_files/insulin%20pump.jpg

పరిస్థితి కొంత విషమంగా ఉన్న కొంత మంది రోగులకు గంట గంటకూ ఇన్సులిన్ ఇవ్వవలసి ఉంటుంది. అలాంటి వారికి చర్మంలోనే అమర్చి ఉంచే ఇన్సులిన్ పంప్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. శరీర అవసరాన్ని బట్టి ఇది మూడు నుంచి ఆరు మాసాల దాకా వస్తుంది. అలాగే సాధారణ మధుమేహుల్లో కూడా కొందరికి ఇన్సులిన్ రోజూ తీసుకోవడం ఇష్టం ఉండదు. అలాంటి వారికి కూడా ఇన్సులిన్ పంప్ బాగా ఉపయోగపడుతుంది. సబ్‌ట్యూటేనియస్ ఇంప్లాంట్ ఇన్సులిన్ పంప్ అనే ఈ పరికరం ఇప్పుడు పెద్ద సౌలభ్యంగా ఉంది.

* డాక్టర్ ఎస్. వి. ప్రసాద్ రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ గవర్నమెంట్ చెస్ట్ హాస్పిటల్ హైదరాబాద్

షుగర్ ఉంటే ఊబకాయం!

  http://rlv.zcache.com/diabetes_obesity_diabesity_tshirt-p235492290384050037trlf_400.jpg
మధుమేహంతో బాధపడుతున్న వారికి తాజాగా కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. టైప్ - 2 మధుమేహం సమస్య ఉన్న వారిలో ఊబకాయ సమస్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. టైప్-2 మధుమేహం ఉన్న ప్రతి అయిదుగురిలో ఒకరు అధికబరువుతో బాధపడుతున్నారు. ఊబకాయం వస్తున్నది. అమెరికాలో ఈ మేరకు జరిపిన అధ్యయనాల్లో బెంబేలెత్తించే వాస్తవాలు బయటపడ్డాయి. అమెరికాలో టైప్ - 2 మధుమేహం సమస్య ఉన్న వారిలో 62శాతం మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారని తేలింది. 20 శాతం మంది మరీ ఎక్కువ బరువైపోయి, కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నారని లయోలా హెల్త్ యూనివర్శిటీ చేసిన అధ్యయనాల్లో వెల్లడైంది. మధుమేహంతో పాటు అధిక బరువు సమస్య పెరిగితే భవిష్యత్‌లో పలు చిక్కులు ఎదురవుతాయని ప్రజారోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పౌష్టికాహారం తీసుకోక పోవటం, సోడా వినియోగం పెరగటం, వ్యాయామం తగ్గటం వల్ల మధుమేహంతోపాటు ఊబకాయుల సంఖ్య పెరుగుతోంది. అమెరికా జనాభాలో 7.8శాతం అంటే 2.3 కోట్ల మంది మధుమేహ సమస్యతో బాధపడుతున్నారని అంచనా. ఇందులో 90శాతం మందికి టైప్-2 మధుమేహం ఉంది. తగినంత వ్యాయామం లేకపోవడం, ఆహారపు అలవాట్లలో మార్పులు తదితర కారణాలతో అక్కడ మధుమేహం సమస్య పెరిగిందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఆహారపు ఆలవాట్ల విషయంలో అమెరికా బాట పడుతున్న మనం మరింత జాగ్రత్తగా ఉండాలేమో?

షుగర్ మోసుకొచ్చే 'టీవీ'క్షణం
మీరు రోజుకు రెండు నుంచి మూడు గంటలు టెలివిజన్ చూస్తున్నారా? అయితే మీకు పలు రకాల వ్యాధులు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రతీ రోజు టీవీ ఎక్కువగా చూసే వారిలో మధుమేహం టైప్ 2 ముప్పు వచ్చే అవకాశాలు 20శాతం ఉన్నాయని తాజాగా శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో తేలింది. ఒక్క మధుమేహమే కాదు గుండెజబ్బులు వచ్చే అవకాశాలు 15శాతం అధికంగా ఉంటుంది. టీవీ ఎక్కువగా చూసేవారిలో 13శాతం వివిధ కారణాల వల్ల మృత్యువుకు చేరువ అవుతున్నారని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. టీవీ రోజుకు మూడు గంటలు చూస్తున్నారంటే, ఆ సమయంలో తీసుకుంటున్న ఫ్రైడ్ ఆహారపదార్థాలు, తీపి పానీయాలు కొలెస్ట్రాల్, బ్లడ్‌షుగర్‌లను పెంచుతుందని తేలింది. దీనివల్ల ఒబేసిటీ, బీపీ, హైబ్లడ్‌షుగర్ లాంటి సమస్యలు పెరిగి హృద్రోగ సమస్యలకు దారితీస్తుందని వైద్యులు చెపుతున్నారు. చిప్స్‌లో ఆయిల్, ఉప్పుతో పాటు అధిక కేలరీలు ఉంటాయి. ఇవి తినటం వల్ల వివిధ జబ్బులు వచ్చిపడతాయని యూనివర్శిటీ సదరన్ డెన్మార్క్, హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

షుగర్ ఉంటే ఇలా తినాలి
మధుమేహం ఉన్న వారు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ పిరమిడ్‌లో సూచించిన విధంగా ఆహారం తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా జీవించే వీలుంటుంది. మధుమేహం ఉన్న వారు స్వీట్లు, ఆల్కహాల్ తీసుకోరాదు. తీసుకున్నా చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. కొవ్వు పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి. ఇక పాలు, మాంసాహారాన్ని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.కూరగాయలు, పండ్లు అధికంగా తీసుకోవాలి. ఇక చిరుధాన్యాలు, బ్రెడ్ వంటి పదార్థాలను పుష్కలంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Historical Introduction

Historical Introduction:

Diabetes mellitus or Madhumeham has been known for centuries as a disease related to poor functioning of the Pancreatic gland . Person with diabetes have to much sugar in blood and urine. However, there is no need to worry, since diabetes can be kept under control with certain changes in the lifestyle, food intake, exercise & regular intake of prescribed medicines.

Diabetes mellitus is a chronic metabolic disorder that prevents the body to utilise glucose completely or partially. It is characterized in the blood and alteration in carbohydrate, protein and fat metabolism. This can be due to failure in the formation of insulin or liberation or action.

Few Facts You Should Know
  • India is world's Diabetes Capital
  • Diabetes is a killer disease
  • Every 10 seconds a person dies from diabetes-related causes.
  • In 2025, 80% of all cases of diabetes will be in low- and middle-income countries.
  • Diabetes is not a old age disease.
  • 80% of Type 2 diabetes is preventable


Since insulin is produced by the Beta cells of the islets of langerhans, any receding in the number of functioning cells will decrease the amount of insulin that can be synthesised. Many diabetics can produce sufficient insulin but some stimulus to the islets tissue is needed in order that secretion can take place.

“Diabetes Mellitus is a word derived form Greek word Diabetes which means Siphon, Mellitus means Sweet i.e, “ flowering of sweet liquid.”